Makar Sankranti 2026: మకర సంక్రాంతి స్పెషల్.. తండ్రి-కొడుకుల మధ్య విభేదాలకు చెక్! ఈ పరిహారాలు పాటిస్తే మీ బంధం సూపర్‌హిట్
Makar Sankranti 2026: తండ్రి - కొడుకు మధ్య గొడవలా? మకర సంక్రాంతి రోజు ఈ చిన్న మార్పులు చేయండి, మీ బంధం బలపడుతుంది. సూర్య-శని అనుగ్రహం పొందేందుకు ఆధ్యాత్మిక చిట్కాలు మరియు పరిహారాలు.
Makar Sankranti 2026: మకర సంక్రాంతి స్పెషల్.. తండ్రి-కొడుకుల మధ్య విభేదాలకు చెక్! ఈ పరిహారాలు పాటిస్తే మీ బంధం సూపర్‌హిట్
Makar Sankranti 2026: కుటుంబంలో తండ్రి, కొడుకుల మధ్య సంబంధం పటిష్టంగా ఉండటం ఇంటి ప్రశాంతతకు ఎంతో ముఖ్యం. అయితే చాలా కుటుంబాల్లో వీరిద్దరి మధ్య తరచుగా విభేదాలు వస్తుంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మకర సంక్రాంతి రోజున తీసుకునే కొన్ని ప్రత్యేక చర్యలు తండ్రి-కొడుకుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి, ప్రేమానురాగాలను పెంచుతాయి.
సూర్య-శని సంబంధం వెనుక ఉన్న పరమార్థం: మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుడు తన కుమారుడైన శని దేవుడి నివాసం మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. శని మరియు సూర్యుడు తండ్రి-కొడుకులు అయినప్పటికీ, వారి మధ్య వైరుధ్యం ఉంటుందని పురాణాలు చెబుతాయి. కానీ సంక్రాంతి సమయంలో సూర్యుడు స్వయంగా కుమారుడి ఇంటికి వెళ్లి నెల రోజుల పాటు అక్కడే ఉంటాడు. ఇది కలియకకు, సయోధ్యకు సంకేతం. అందుకే ఈ రోజు చేసే పరిహారాలు తండ్రి-కొడుకుల బంధానికి మేలు చేస్తాయి.
బంధం బలపడటానికి పాటించాల్సిన పరిహారాలు:
తీర్థయాత్రలు - పవిత్ర స్నానాలు: సంక్రాంతి రోజున వీలైతే తండ్రితో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించండి. గంగానది లేదా ఇతర పవిత్ర నదులలో కలిసి స్నానం చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయి. సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి, "ఓం ఘృణి సూర్యాయ నమః" మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల సూర్య గ్రహ దోషాలు పోయి సంబంధాలు మెరుగుపడతాయి.
అన్నదానం - శివాభిషేకం: స్నానం చేసిన తర్వాత శివాలయానికి వెళ్లి శివలింగానికి జలాభిషేకం చేయాలి. అనంతరం బియ్యం, పప్పు, బెల్లం, నెయ్యి, ముఖ్యంగా నువ్వులను దానం చేయండి. శని దేవునికి ఇష్టమైన నువ్వులను దానం చేయడం ద్వారా తండ్రి-కొడుకుల మధ్య కర్మ ఫలాలు సజావుగా సాగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
తండ్రికి ప్రత్యేక బహుమతి: మకర సంక్రాంతి రోజున మీ తండ్రికి ఇష్టమైన వస్తువును బహుమతిగా ఇవ్వండి. వారు యాత్రలకు రాకపోయినా, మీరు ఒంటరిగా వెళ్లి వచ్చిన తర్వాత వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి. ఈ చిన్న మార్పు మీ మధ్య ఉన్న అపార్థాలను తొలగించి, మార్పుకు నాంది పలుకుతుంది.
ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం నమ్మకాలు మరియు ఆధ్యాత్మిక గ్రంథాల ఆధారంగా అందించబడింది. దీనిని పాటించే ముందు సంబంధిత జ్యోతిష్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.