గరుడ పురాణం ప్రకారం.. ఈ ఆరింటిని పూజిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి..!

Garuda Purana: హిందూ మతంలో ప్రాచీన గ్రంథాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. గరుడ పురాణం 18 పురాణాలలో ఒకటి.

Update: 2022-03-24 10:30 GMT

గరుడ పురాణం ప్రకారం.. ఈ ఆరింటిని పూజిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి..!

Garuda Purana: హిందూ మతంలో ప్రాచీన గ్రంథాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. గరుడ పురాణం 18 పురాణాలలో ఒకటి. ఇందులో వ్యక్తి చేసే చర్యలను బట్టి లభించే ఫలాల గురించి ప్రస్తావించారు. జీవితం విజయవంతం కావడానికి, పురోగతిని సాధించడానికి గరుడ పురాణంలో అనేక విషయాలు చెప్పారు. వాటి అర్థాన్ని తెలుసుకుంటే జీవితం సుఖమయం అవుతుంది. గరుడ పురాణంలో అటువంటి 6 విషయాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

1. విష్ణువు

ధార్మిక గ్రంథాల ప్రకారం విష్ణువు భక్తుల కష్టాలన్నింటినీ తొలగిస్తాడు. వారి జీవితంలో వెలుగులు నింపుతాడు. ఏ వ్యక్తి అయితే భగవంతుని పట్ల భక్తితో రోజును ప్రారంభిస్తాడో ఆ వ్యక్తి చేసే పనిలో విజయం సాధిస్తాడు. ఈ పరిస్థితిలో శ్రీమహావిష్ణువు ఆరాధన క్రమం తప్పకుండా చేయాలి.

2. ఏకాదశి ఉపవాసం

ఏకాదశి ఉపవాసం గురించి గరుడ పురాణంలో చెప్పారు. అన్ని ఉపవాసాలలో కంటే ఏకాదశి ఉపవాసం ఉత్తమమైనది. ఏకాదశి వ్రతాన్ని పూర్తి భక్తితో ఆచరించే వ్యక్తి జీవితంలో శుభ ఫలితాలను పొందుతాడు. కావున జీవితంలో సుఖసంతోషాలు పొందాలంటే ఏకాదశి వ్రతం కచ్చితంగా పాటించాలి.

3. గంగానది

గరుడ గ్రంథం ప్రకారం గంగా జలం అన్ని పాపాల నుంచి విముక్తి కల్పిస్తుంది. అందుకే ఏ శుభ కార్యమైనా గంగాజలాన్ని ఉపయోగిస్తారు. గంగాజలంతో శుద్ధి చేస్తారు. అందుకే గంగాజలాన్ని పూజించాలి.

4. తులసి

తులసి మొక్క లక్ష్మీదేవికి సంబంధించినది. విష్ణువుకు తులసి మొక్క అంటే చాలా ఇష్టం. శ్రీ హరి అనుగ్రహం పొందాలంటే చాలామంది తులసి మొక్కను పూజిస్తారు. తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించడం వల్ల జీవితంలోని అన్ని బాధలు తొలగిపోతాయని నమ్ముతారు.

5. పండితుడు

మత గ్రంధాల ప్రకారం ఒక తెలివైన వ్యక్తిని లేదా పండితుడిని గౌరవించడం ద్వారా ఆ వ్యక్తి జీవితంలో విజయాన్ని సాధిస్తాడు. గ్రంధాలలో జ్ఞానవంతుని అవమానించడం పాపమని చెప్పారు.

6. ఆవు

హిందూ మతంలో గోవుకు గౌరవప్రదమైన స్థానం ఉంది. గరుడ పురాణం ప్రకారం అన్ని దేవతలు, గోవులో నివసిస్తారు. గోవును దేవతగా పూజించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి.

గమనిక: ఈ సమాచారం గరుడ పురాణం ప్రకారం సూచించడం జరిగిందని గమనించగలరు.

Tags:    

Similar News