World Kidney Day 2021: కిడ్నీల ఆరోగ్యానికి 8 గోల్డెన్ రూల్స్

World Kidney Day 2021: ఎన్నో సరికొత్త వైద్య పద్ధతులు వచ్చినా.. ఆందోళన కలిగిండే వ్యాధుల్లో ఒకటి కిడ్నీ సమస్య.

Update: 2021-03-11 05:39 GMT

వరల్డ్ కిడ్నీ డే 2021

World Kidney Day 2021: ఎన్నో సరికొత్త వైద్య పద్ధతులు వచ్చినా.. ఆందోళన కలిగిండే వ్యాధుల్లో ఒకటి కిడ్నీ సమస్య. కిడ్నీ వ్యాధులకు చాలా కారణాలు ఉంటాయి. వాటిలో ప్రధానంగా జీవన శైలీలో మార్పులు, పెయిన్ కిల్లర్స్ (నొప్పుల మాత్రలు) ఎక్కువగా వాడటం, గాలి, నీరు కాలుష్యం మొదలైనవి కూడా ప్రభావం చూపుతాయి. మానవ శరీరంలో ఇతక పార్ట్స్ పనితీరు సక్రమంగా లేకపోవడం కూడా.. ఆ ప్రభావం కిడ్నీల పై పడుతుంది. దేశంలో ఏటా 2 లక్షల మంది కొత్తగా కిడ్నీ జబ్బుల బారినపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతోంది.

ఇలా చూస్తే..ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. రక్తంలో చేరే మలినాలను, క్లీన్ చేసి బయటకు పంపడంలో కిడ్నీ అత్యంత కీలకమైంది. ప్రతి ఏటా కిడ్నీ వ్యాధులతో బాధపడే వారి సంఖ్య పెరుగుతున్నందు వల్ల ఇంటర్నేషనల్ మెడికల్ డిపార్ట్మెంట్ అప్రమత్తమైంది. ప్రజల్లో కిడ్నీ వ్యాధులపై అవగాహనకు నడుం బిగించింది. ఇంటర్నేషనల్‌ నెఫ్రాలజీ ఫెడరేషన్‌ ఆఫ్‌ కిడ్నీ ఫౌండేషన్‌ అనే సంస్థ వరల్డ్‌ కిడ్నీ డేను చేపడుతోంది. ప్రతి ఏటా మార్చి రెండో గురువారం వరల్డ్‌ కిడ్నీ డే గా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఓ నినాదంతో ప్రజలకు అవగాహన కలిగించనున్నారు. ఈ ఏడాది ‌ "కిడ్నీ వ్యాధులున్నా అధైర్యపడకుండా.. ప్రశాంతంగా జీవించడం" (Living well with Kidney disease) అనే నినాదంతో (Theme) సెలబ్రేట్ చేస్తున్నారు.

కిడ్నీ లో ఆరోగ్యానికి ఈ 8 గోల్డ్ న్ రూల్స్ పాటించండి: (8 Golden Rules For Kidneys)

  1. ఫిట్ గా ఉండడంతో పాటు యాక్టివ్ గా ఉండాలి
  2. ఆరోగ్యవంతమైన డైట్ ని పాటించాలి
  3. బ్లడ్ షుగర్ ను తరచుగా చెక్ చేసుకుంటూ, అదుపులో ఉంచుకోవాలి
  4. బీపీ ని కూడా తరుచుగా పరీక్షించుకుంటూ, కంట్రోల్ లో ఉంచుకోవాలి
  5. లిక్విడ్ (ద్రవ) పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి
  6. పొగ తాగడం పూర్తిగా మానాలి
  7. నొప్పి మాత్రలు అతిగా వాడకూడదు
  8. తరచుగా కిడ్నీ పనితీరును ఓ కంట కనిపెడుతూ, టెస్టులు చేయించుకోవాలి

కిడ్నీ వ్యాధుల లక్షణాలు:

  • మూత్రపిండాల పనితీరు మందగిస్తుంటే కొన్ని లక్షణాలు బయట పడుతాయి. కిడ్నీల పనితీరు మారుతుంది. లేదా కిడ్నీలు చెడిపోతాయి.
  • రాత్రిపూట ఎక్కువగా మూత్ర విసర్జన వెళ్లాల్సి వస్తుంది.
  • కడుపులో వికారంగా ఉంటుంది. వాంతులవుతుంటాయి.
  • ఆకలి మందగిస్తుంది. తరచూ జ్వరం వస్తుంది.
  • రక్తహీనత, రక్తపోటు పెరుగుతాయి.
  • ఆయాసం, నీరసం పెరుగుతాయి.
  • ఎముకల నొప్పులు, శరీరం పాలిపోవటం వంటి సమస్యలు వస్తాయి.
  • మూత్రం సరిగా రాదు.

జాగ్రత్తలు:

  • కిడ్నీ వ్యాధి ఉన్న వారు ఏడాదికి ఒకసారి వైద్యపరీక్షలు చేయించుకోవాలి.
  • బీపీ, షుగర్‌ ఉన్న వారు అదుపులో ఉంచుకోవాలి.
  • నీరు ఎక్కువగా తాగాలి. ప్రతిరోజూ మూడు నుంచి ఐదు లీటర్ల నీరు తాగాలి.
  • మాంసాహార ప్రోటీన్ల వల్ల కిడ్నీపై ఎక్కువ భారం పడుతుంది. శాఖాహారమే మంచిది.
  • ఉప్పు, పసుపు ఎక్కువగా తీసుకోకూడదు. బీపీ పెరిగి కిడ్నీలపై భారం పడుతుంది.
  • అధిక బరువు కూడా కిడ్నీలపై ప్రభావం చూపుతుంది.
  • కాఫీ, టీలు మితంగా తీసుకోవాలి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.
Tags:    

Similar News