Viral Video: స్విమ్మింగ్ ఫూల్‌లో ‘డెత్ గేమ్’… వైరల్ అవుతోన్న షాకింగ్ వీడియో!

Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం పెరిగిన ఈ యుగంలో, ప్రజలు ప్రత్యేకంగా కనిపించాలనే ఉద్దేశంతో వివిధ విన్యాసాలు చేస్తున్నారు. కొందరు ఫేమస్ కావాలన్న కోరికతో, ఇంకొందరు చుట్టుపక్కలవారికి షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో అత్యంత ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్నారు.

Update: 2025-05-29 07:59 GMT

Viral Video: స్విమ్మింగ్ ఫూల్‌లో ‘డెత్ గేమ్’… వైరల్ అవుతోన్న షాకింగ్ వీడియో!

Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం పెరిగిన ఈ యుగంలో, ప్రజలు ప్రత్యేకంగా కనిపించాలనే ఉద్దేశంతో వివిధ విన్యాసాలు చేస్తున్నారు. కొందరు ఫేమస్ కావాలన్న కోరికతో, ఇంకొందరు చుట్టుపక్కలవారికి షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో అత్యంత ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

ఇటీవల ఒక వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో స్విమ్మింగ్ ఫూల్ దగ్గర జరిగిన ఒక అత్యంత రిస్కీ గేమ్‌ను చూడొచ్చు. సాధారణంగా స్విమ్మింగ్ ఫూల్ వద్ద కొంతమంది ఈత కొడతారు, మరికొందరు ఎత్తైన జారుడు బల్లపై నుంచి నీటిలోకి జారుకుంటారు. కానీ ఈ వీడియోలో విషయం తలకిందులైంది.

వీడియోలో కొంతమంది యువకులు జారుడు బల్ల చివర భాగంలో నిలబడి ఉంటారు. అదే సమయంలో పై నుంచి మరో వ్యక్తి వేగంగా జారుకుంటూ వస్తాడు. ఈ సమయంలో కింద ఉన్న వారు అతనికి తాకకుండా మెల్లగా కిందకు వాలుతూ తప్పించుకోవాలి. ఇది ఓ గేమ్‌లా కనిపించినా, ఇందులోని రిస్క్‌ను చూసినవారంతా గుండెలు పిండి పోతున్నారు.

పైనుంచి జెట్ స్పీడ్‌తో జారుకుంటూ వచ్చే వ్యక్తిని కేవలం రెప్పపాటులో తప్పించుకోవాల్సిన ఈ గేమ్‌ను చూసినవారు “ఇది గేమ్ కాదు, ప్రాణాలతో ఆట” అని అభిప్రాయపడుతున్నారు. ఒక్క తప్పిదం జరిగితే ఘోర ప్రమాదం జరగవచ్చనే విషయాన్ని చాలా మంది నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.

ఈ వీడియోపై నెటిజన్ల నుంచి విస్తృత స్పందన వస్తోంది. “వార్నీ.. ఇదేం గేమ్ రా బాబోయ్.. చూస్తుంటేనే గుండె ఆగిపోతుంది!”, “ఇలాంటి ప్రమాదకర ఆటలు ఆటలుగా కాకుండా ప్రాణాలతో చెలగాటమవుతాయి”, “వైరల్ కావడానికే ప్రాణాలతో ఆడటం ఏమిటి?” అంటూ అనేక మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఈ వీడియో ఇప్పటికే 5 లక్షలకు పైగా వ్యూస్‌ను, 2400కు పైగా లైక్‌లను సంపాదించింది. అయితే, ఇటువంటి స్టంట్లు ఎప్పటికైనా ప్రాణాపాయం కలిగించే అవకాశమున్నవే కనుక, వాటిని ప్రోత్సహించకూడదని నిపుణులు సూచిస్తున్నారు.



Tags:    

Similar News