Viral Video : ఇది మాములు మోసం కాదు.. 4 సెకన్ల వీడియోతో సోషల్ మీడియా షేక్

ఇది మాములు మోసం కాదు.. 4 సెకన్ల వీడియోతో సోషల్ మీడియా షేక్

Update: 2026-02-19 01:56 GMT

Viral Video : సోషల్ మీడియాలో మనం చూసేదంతా నిజం కాదని నిరూపించే మరో షాకింగ్ ఘటన చైనాలో వెలుగుచూసింది. అప్పటిదాకా అప్సరసలా ఉంది అనుకుని లక్షలాది మంది ఆమె అకౌంట్ ఫాలో అయ్యారు. ఆమె అసలు రూపం లైవ్ స్ట్రీమింగ్‌లో బయటపడింది. కేవలం 4 సెకన్ల పాటు జరిగిన ఒక చిన్న టెక్నికల్ గ్లిచ్ ఆమె కెరీర్‌నే తలకిందులు చేసింది. బ్యూటీ ఫిల్టర్ ఆగిపోవడంతో, స్క్రీన్‌పై కనిపిస్తున్న సుందరి కాస్తా ఒక సామాన్యమైన మహిళగా మారిపోవడాన్ని చూసి నెటిజన్లు నోరెళ్లబెట్టారు.

ఈ వింత ఘటన చైనాకు చెందిన డౌయిన్ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో జరిగింది. సదరు ఇన్‌ఫ్లుయెన్సర్ తన ఫాలోవర్లతో లైవ్‌లో ముచ్చటిస్తుండగా, ఆమె వాడుతున్న బ్యూటీ ఫిల్టర్ ఒక్కసారిగా ఆగిపోయింది. ఫిల్టర్ ఉన్నంతసేపు తెల్లటి చర్మం, మెరిసే కళ్లు, షార్ప్ ఫేస్ కట్‌తో దేవకన్యలా కనిపించిన ఆమె.. ఫిల్టర్ పోగానే అసలు రంగు బయటపడింది. ఆమె చర్మం రంగు, ముఖ కవళికలు పూర్తిగా మారిపోయి కనిపించాయి. రెప్పపాటులోనే మళ్ళీ ఫిల్టర్ వచ్చేసినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఈ అందమైన మోసం చూసి షాక్ తిన్న నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 1.40 లక్షల మంది ఫాలోవర్లు ఆమెను అన్‌ఫాలో చేసి షాక్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఫిల్టర్లను నమ్మి తాము ఎంతగా మోసపోతున్నామో ఈ ఘటనతో అర్థమైందని ఫ్యాన్స్ వాపోతున్నారు. చైనాలో ఇలాంటి లైవ్ స్ట్రీమర్లకు నెటిజన్లు భారీగా వర్చువల్ గిఫ్టులు, డబ్బులు పంపిస్తుంటారు. ఈ గ్లిచ్ తర్వాత, తమను మోసం చేస్తున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. బ్యూటీ ఫిల్టర్ల వాడకాన్ని నేరంగా పరిగణించాలి అని ఒకరు అంటే, పాపం ఆమె ఫాలోవర్లు ఆ 4 సెకన్లలో ఏమైపోయారో అని మరొకరు ఎద్దేవా చేస్తున్నారు. ఏది ఏమైనా, వర్చువల్ ప్రపంచంలో అందమంతా కేవలం ఫిల్టర్ల మాయేనని ఈ ఘటన మరోసారి హెచ్చరించింది.

Tags:    

Similar News