Viral Video: వ్యూస్ కోసం వికృత చేష్టలు: కదిలే కార్ల డోర్లు తీస్తూ స్టంట్లు.. రీల్స్ రాయుడికి జైలు శిక్ష!

Viral Video: సోషల్ మీడియాలో 'లైకులు', 'వ్యూస్' కోసం యువత ఎంతటి తెగింపునకైనా వెళ్తున్నారు.

Update: 2026-02-18 06:54 GMT

Viral Video: వ్యూస్ కోసం వికృత చేష్టలు: కదిలే కార్ల డోర్లు తీస్తూ స్టంట్లు.. రీల్స్ రాయుడికి జైలు శిక్ష!

Viral Video: సోషల్ మీడియాలో 'లైకులు', 'వ్యూస్' కోసం యువత ఎంతటి తెగింపునకైనా వెళ్తున్నారు. పక్కవారి ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. తాజాగా ఢిల్లీలోని ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో ఇటువంటి ఘటనే కలకలం రేపింది. రోడ్డుపై వేగంగా వెళ్తున్న వాహనాల తలుపులు తీస్తూ హల్‌చల్ చేసిన ఓ యువకుడిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.

అసలేం జరిగిందంటే?

ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల తుషార్ పునియా అనే యువకుడు తరచూ బహిరంగ ప్రదేశాల్లో ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ రీల్స్ చేసేవాడు. ఇటీవల ఒక వీడియోలో అతడు నంబర్ ప్లేట్ లేని బైక్‌పై వెళ్తూ.. పక్కనే ప్రయాణిస్తున్న బస్సులు, ఆటోలు, కార్ల తలుపులను హఠాత్తుగా తెరిచి వెళ్తున్నాడు. ఒక చేత్తో బైక్ హ్యాండిల్ పట్టుకుని, మరో చేత్తో డోర్లు తీస్తూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలను మరో వ్యక్తి షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

పోలీసుల వేట.. నిందితుడు అరెస్ట్

ఈ వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్ ధరించడమే కాకుండా, తన బైక్‌కు రిజిస్ట్రేషన్ ప్లేట్ కూడా లేకుండా జాగ్రత్త పడేవాడని గుర్తించారు. అయినప్పటికీ సాంకేతిక ఆధారాలతో నిందితుడు తుషార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల హెచ్చరిక:

"వ్యూస్ కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఉపేక్షించేది లేదు. బహిరంగ ప్రదేశాల్లో ప్రమాదకరంగా రీల్స్ చేస్తూ ఇతరులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని పోలీసులు హెచ్చరించారు. నిందితుడిపై మోటార్ వాహనాల చట్టం మరియు ప్రజల భద్రతకు విఘాతం కలిగించినందుకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.


Tags:    

Similar News