Viral Video : ఇదో వింత కారు.. ఇంజిన్, సీటు అంతే! బాడీతో పనిలేదు.. అలా ఎలా అబ్బా?

ఇదో వింత కారు.. ఇంజిన్, సీటు అంతే! బాడీతో పనిలేదు.. అలా ఎలా అబ్బా?

Update: 2026-02-20 02:40 GMT

Viral Video : సోషల్ మీడియా పుణ్యమా అని మనం రోజుకో వింతను చూస్తున్నాం. రోడ్ల మీద ఎన్నో రకాల విలాసవంతమైన కార్లు, స్పోర్ట్స్ కార్లు తిరగడం చూస్తుంటాం. కానీ, ఇప్పుడు వైరల్ అవుతున్న ఒక కారును చూస్తే మాత్రం మీరు నోరెళ్లబెట్టాల్సిందే. కారు అంటే కనీసం బాడీ ఉండాలి, డోర్లు ఉండాలి.. కానీ ఇక్కడ ఉన్న కారుకు కేవలం ఇంజన్, ఒక సీటు, స్టీరింగ్ మాత్రమే ఉన్నాయి. అస్థిపంజరంలా ఉన్న ఈ కారు రోడ్డు మీద దర్జాగా దూసుకెళ్తుంటే చూసిన జనం షాక్ తింటున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక బిజీ రోడ్డు కనిపిస్తుంది. వాహనాలన్నీ వేగంగా వెళ్తున్న సమయంలో, ఒక వింత ఆకారం వేగంగా దూసుకొచ్చింది. దగ్గరకు వచ్చి చూస్తే అది ఒక కారు అని అర్థమవుతుంది. ఆ కారుకు ముందు భాగంలో ఇంజన్, రెండు టైర్లు, ఒక స్టీరింగ్.. ఆ వెనుక ఒకే ఒక్క డ్రైవింగ్ సీటు ఉన్నాయి. మిగతా బాడీ అంతా మాయం. ఆ సీటు కూడా రోడ్డుకు అతి తక్కువ ఎత్తులో ఉండి, కింద రాసుకుపోతుందేమో అన్నట్టుగా ఉంది. కనీసం కబడీ వాడు కూడా పనికిరాదని వదిలేసే ఆ కారును, ఒక వ్యక్తి ఎంతో కూల్‌గా డ్రైవ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఈ వీడియోను చూస్తుంటే ఒక పక్క నవ్వు వచ్చినా, మరోపక్క ఒళ్లు గగుర్పు పొడుస్తోంది. ఏ చిన్న ప్రమాదం జరిగినా డ్రైవర్ ప్రాణాలు గాలిలో కలవడం ఖాయం. ఆ డ్రైవింగ్ సీటు రోడ్డుకు తగులుతూ వెళ్తున్న తీరు చూస్తుంటే ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అనిపిస్తోంది. ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ అయిన ఈ వీడియోకు నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. దీన్ని కదా నిజమైన ఓపెన్ ఎయిర్ డ్రైవింగ్ అంటారు! అని ఒకరు జోక్ చేయగా, దీనికి సీటు బెల్టు అక్కర్లేదు, ఎయిర్ బ్యాగులు అస్సలు అక్కర్లేదు.. ప్రమాదం జరిగితే నేరుగా పైకే! అంటూ మరొకరు సెటైర్లు వేశారు.

ప్రస్తుతం ఈ 10 సెకన్ల వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. వేల సంఖ్యలో వ్యూస్ వస్తున్నా, అందరూ ఒకే మాట చెబుతున్నారు.. ఇలాంటి సాహసాలు ప్రాణాలకు ప్రమాదమని..రక్షణ లేని ఇలాంటి వాహనాలను రోడ్ల మీదకు తీసుకురావడం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధమని అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News