Optical Illusion : ఈ పిక్నిక్ ఫోటోలో ఐస్‌క్రీమ్ ఎక్కడ ఉందో చెప్పండి చూద్దాం?
మొదటి చూపులో సాధారణ పిక్నిక్ సీన్‌లా కనిపిస్తుంది… కానీ జాగ్రత్తగా చూస్తే దాగి ఉన్న ఐస్‌క్రీమ్ మీ కళ్ల ముందే ఉంటుంది! మీరు 10 సెకన్లలో కనుగొనగలరా? 👀
ఆప్టికల్ ఇల్యూషన్స్ మన మెదడును గందరగోళానికి గురిచేయడంలో భలే గమ్మత్తుగా పని చేస్తుంటాయి. ఒక బొమ్మను చూసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కోలా అనిపించడం వెనుక మన మెదడు పనితీరు దాగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పజిల్స్‌ను స్వాల్ చేయడం ద్వారా మన మెదడుకు మంచి వ్యాయామం లభిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయన్నారు. ఇంతకీ ఈ రోజు ఛాలెంజ్ ఏంటో తెలుసా.. పైన ఇచ్చిన చిత్రంలో ఒక కుటుంబం సరదాగా పిక్నిక్‌కు వెళ్లినట్లు కనిపిస్తుంది కదా. అయితే, ఈ చిత్రంలో సాధారణంగా మనకు కనిపించని ఒక ఐస్‌క్రీమ్ దాగి ఉంది. పట్టిపట్టి చూస్తేగాని ఆ ఐస్‌క్రీమ్ మన కళ్లకు కనిపించదు. ఇప్పుడు ఛాలెంజ్ విషయానికి మీ కళ్లు ఎంత షార్ప్‌గా పని చేస్తు్న్నాయో తెలుసుకునే విషయానికి వద్దాం. ఈ ఫోటోలో మీరు ఆ ఐస్‌క్రీమ్‌ను కేవలం 10 సెకన్లలో గుర్తించగలిగితే.. మీ కళ్లు సూపర్ షార్ప్ అని అర్థం.
మరి ఇంకేందుకు ఆలస్యం మొదలుపెట్టండి. నిజానికి చాలా మంది వారి మొదటి చూపులో ఆ ఐస్‌క్రీమ్ కనిపెట్టలేకపోవచ్చు. ఎందుకంటే ఆ ఐస్‌క్రీమ్‌ను చాలా తెలివిగా దాచారు. ఫోటో మొత్తాన్ని ఒకసారి సరిగ్గా గమనించండి. అయినా కనిపించలేదా.. సరేసరే.. ఫోటోలో రైట్ సైడ్ ఉన్న పిక్నిక్ బుట్ట దగ్గర ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. అక్కడ ఒక ఫ్లాస్క్ కనిపిస్తుంది కదా? దాని పక్కనే ఆ ఐస్‌క్రీమ్ దాగుంది. నిజానికి ఇలాంటి గమ్మత్తైన పజిల్స్‌ను సాల్వ్ చేయడం ద్వారా మీ ఏకాగ్రత, అబ్వరేషన్ స్కిల్స్ పెరుగుతాయని చెబుతున్నారు.