Karan Gupta Fraud: వీడు మామూలోడు కాదు.. పని చేయకుండానే లక్షల జీతం తీసుకున్నాడు!
ఏం పని చేయకుండానే ఏడాదికి లక్షల రూపాయల జీతం రావడం అనేది ఎవరికైనా ఒక కలలా అనిపిస్తుంది.
Karan Gupta Fraud: వీడు మామూలోడు కాదు.. పని చేయకుండానే లక్షల జీతం తీసుకున్నాడు!
ఏం పని చేయకుండానే ఏడాదికి లక్షల రూపాయల జీతం రావడం అనేది ఎవరికైనా ఒక కలలా అనిపిస్తుంది. కానీ, అమెరికాలోని ఒక భారతీయ సంతతి వ్యక్తి ఈ కలను నిజం చేసుకొని ఏకంగా రూ. 11 కోట్ల భారీ మోసానికి తెరలేపాడు. కార్పొరేట్ ప్రపంచాన్ని షేక్ చేసిన ఈ కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. మిన్నియాపాలిస్‌కు చెందిన కరణ్ గుప్తా (47) అనే వ్యక్తి 'ఆప్టమ్' అనే కంపెనీలో డేటా అనలిటిక్స్ సీనియర్ డైరెక్టర్‌గా పనిచేసేవాడు. అతనికి వచ్చే జీతం ఎంతో తెలుసా.. ఏడాదికి దాదాపు రూ. 2.3 కోట్లు. అయినా సరే మనోడికి, మరింత డబ్బు సంపాదించాలనే ఆశ కలిగి, అది దురాశగా మారింది. దీంతో ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు.
2015లో కరణ్ తనకి తెలిసిన ఒక వ్యక్తిని తన కింద మేనేజర్ స్థాయి ఉద్యోగంలో చేర్పించాడు. ఇందుకోసం అతని పేరుతో ఒక నకిలీ రెజ్యూమ్ సృష్టించాడు. ఈ ఉద్యోగం యొక్క స్పెషాలిటీ ఏంటంటే.. కరణ్ అపాయింట్ చేసిన ఆ ఉద్యోగి కేవలం మనోడికి మాత్రమే రిపోర్ట్ చేయాలి. దాదాపు నాలుగేళ్ల పాటు ఆ ఉద్యోగి కంపెనీ కోసం ఒక్క పని కూడా చేయలేదు. వారాల తరబడి సిస్టమ్ కూడా లాగిన్ అయ్యేవాడు కాదు. కానీ, అతనికి రావాల్సిన జీతం, బోనస్, ఇంక్రిమెంట్లు మాత్రం క్రమం తప్పకుండా వచ్చేవి. నిజానికి ఆ వ్యక్తికి ఈ ఉద్యోగం ఇప్పించినందుకు కరణ్ రూల్ పెట్టాడు. ఇంతకీ ఆ రూల్ ఏంటో తెలుసా.. సదురు ఉద్యోగికి వచ్చే జీతంలో సగం డబ్బును కరణ్‌కు లంచంగా ఇవ్వాలి. అంటే దాదాపు ఏడాదికి రూ. 45 లక్షలు కరణ్ జేబులోకి వెళ్లేవన్నమాట.
ఎలా దొరికిపోయాడో తెలుసా..
డబ్బులు చేతులు మారే విషయంలో వీళ్లిద్దరూ చాలా తెలివిగా వ్యవహరించారు. ఆ ఉద్యోగి పేరు మీద ఒక బ్యాంక్ ఖాతా తెరిచి, దాని డెబిట్ కార్డును కరణ్ దగ్గరే ఉంచుకున్నాడు. ఏటీఎంల ద్వారా నేరుగా లంచం డబ్బును డ్రా చేసేవాడు. కానీ, 2019లో వేరే కారణంతో కరణ్‌ను కంపెనీ నుంచి తొలగించారు. ఆ తర్వాత జరిగిన ఇంటర్నల్ ఎంక్వైరీలో ఈ సదురు ఉద్యోగి వ్యవహారం బయటపడింది. ఈ మోసం వల్ల కంపెనీకి దాదాపు రూ. 11 కోట్ల నష్టం వాటిల్లిందని దర్యాప్తులో తేలింది. ఫెడరల్ కోర్టు విచారణలో కరణ్ గుప్తా నేరం రుజువైంది. ఎఫ్‌బీఐ కూడా దీనిని నమ్మకద్రోహంగా పేర్కొంది. కష్టపడి పనిచేసే ఉద్యోగుల మధ్య ఇలాంటి మోసగాళ్లు వ్యవస్థను ఎలా భ్రష్టు పట్టిస్తారో చెప్పడానికి ఈ కేసు ఒక ఉదాహరణగా విశ్లేషకులు చెబుతున్నారు.