Viral Video: వంట పాత్రల్లో దూరిన కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే ఆశ్చర్య పోవడం ఖాయం..!

Venomous King Cobra Video: ఇప్పుడు పాముల భయం గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, పట్టణాల్లోనూ పెరుగుతోంది.

Update: 2025-06-12 11:18 GMT

Viral Video: వంట పాత్రల్లో దూరిన కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే ఆశ్చర్య పోవడం ఖాయం..!

Venomous King Cobra Video: ఇప్పుడు పాముల భయం గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, పట్టణాల్లోనూ పెరుగుతోంది. ఎన్నో రకాల ప్రమాదకరమైన పాములు అడవులను వదిలి, ఎక్కువగా జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇళ్లలో, పొలాల్లో, బస్తీల్లో ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షమవుతున్నాయి. వీటిని చూసి చాలామంది భయపడుతున్నారు. ఇక కొంతమంది తెలియకపోయినా, అజాగ్రత్త వల్ల వాటిని తాకి ప్రమాదాలకు గురవుతున్నారు. పాములు ప్రమాదకరమైనవని తెలిసినా కొందరు వాటితో చెలగాటమాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

తాజాగా ఓ ఇంట్లో వంటగదిలో అత్యంత విషపూరితమైన నాగుపాము ప్రత్యక్షమైంది. అది కిచెన్‌లోని వంట సామాన్ల కింద దూరిపోయింది. అది ఎప్పటి నుంచి అక్కడ ఉందో ఎవరికీ తెలియదు. కానీ ఇంట్లోని ఓ వ్యక్తి పామును గమనించడంతో కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా బయపడి పరుగులు పెట్టారు.

వెంటనే పాము ఉందని స్నేక్ క్యాచర్స్‌కు సమాచారం ఇచ్చారు. కొద్ది సేపటిలో అక్కడికి చేరుకున్న పాములు పట్టే యువకుడు, వంట సామాన్ల కింద దాక్కున్న పామును పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అది చాలా ప్రమాదకరమైన పాము కావడంతో ఎంతో చురుకుగా ఉండింది. దాదాపు పది నిమిషాల పాటు తీవ్రంగా శ్రమించిన తర్వాత అతడు ఆ పామును పట్టగలిగాడు.

తరువాత ఆ పామును సురక్షితంగా ఓ డబ్బాలో పెట్టి, అడవిలో వదిలేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వంటగదిలో కూడా పాములు కనిపించడం పట్ల నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు.

వైద్య నిపుణులు కూడా పాములు ఎక్కువగా జనాభాసాల్లో సంచరిస్తున్న ఈ పరిస్థితుల్లో ఎవరైనా పామును గమనిస్తే తక్షణమే నిపుణులను సంప్రదించాలని, వాటిని తాకరాదని హెచ్చరిస్తున్నారు.


Tags:    

Similar News