Viral Video: 12 అంగుళాల కత్తిని మింగిన నాగుపాము.. చివరకు ఏమైందంటే..?

Snake Swallows Knife: పాములకు సంబంధించి వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

Update: 2025-06-11 07:10 GMT

Viral Video: 12 అంగుళాల కత్తిని మింగిన నాగుపాము.. చివరకు ఏమైందంటే..?

Snake Swallows Knife: పాములకు సంబంధించి వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అడవుల నుంచి జనావాసాలకు వచ్చిన పాములు తరచూ చిక్కుకుంటూ, ప్రాణాలు కోల్పోతుంటాయి. అయితే కొంతమంది మాత్రం వాటిని రక్షించి సురక్షితంగా అడవుల్లోకి విడిచి పెడతారు. తాజాగా ఇలాంటి ఒక అద్భుత సంఘటన కర్ణాటకలో జరిగింది.

హెగ్డే గ్రామంలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ నాగుపాము 12 అంగుళాల కత్తిని మింగేసింది. ఇది వింటే ఆశ్చర్యంగా ఉంది కదూ! గణపతి నాయక్ అనే వ్యక్తి ఇంటి బయట ఉన్న కత్తిని ఆ పాము పొరపాటున మింగేసింది. అయితే, కత్తి పిడి భాగం బయట ఉండడంతో పాము పూర్తిగా మింగలేక, తాగలేక, ముందుకు కదలలేక తీవ్రంగా బాధపడింది.

ఈ దృశ్యాన్ని గమనించిన ఆ కుటుంబ సభ్యులు వెంటనే సమీప వెటర్నరీ డాక్టర్ భట్కు, అలాగే స్నేక్ క్యాచర్‌కి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని, పామును పట్టుకుని, పాము నోట్లోని కత్తిని జాగ్రత్తగా బయటకు తీశారు.

కత్తి తీసిన తర్వాత నాగుపాము ఊపిరి పీల్చుకుని కొంత సమయం తర్వాత స్నేక్ క్యాచర్, డాక్టర్ కలిసి ఆ పామును సమీప అడవిలో విడిచిపెట్టారు. నెమ్మదిగా అడవిలోకి వెళ్లిపోయిన ఆ నాగుపాము ప్రాణాలతో బయటపడింది.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోను చూసిన వారు పామును కాపాడిన వారికి అభినందనలు తెలుపుతున్నారు.

Full View


Tags:    

Similar News