Viral News: పెళ్లి వేదిక‌పై వ‌రుడు కిడ్నాప్‌.. అచ్చంగా సినిమాల్లోలాగే

Viral News: పెళ్లి వేడుక జ‌రుగుతున్న స‌మ‌యంలో పెళ్లి కూతురుల‌ను కిడ్నాప్ చేసే సంఘ‌ట‌న‌ల‌ను సినిమాల్లో చూసి ఉంటాం.

Update: 2025-05-26 07:39 GMT

Viral News: పెళ్లి వేదిక‌పై వ‌రుడు కిడ్నాప్‌.. అచ్చంగా సినిమాల్లోలాగే 

Viral News: పెళ్లి వేడుక జ‌రుగుతున్న స‌మ‌యంలో పెళ్లి కూతురుల‌ను కిడ్నాప్ చేసే సంఘ‌ట‌న‌ల‌ను సినిమాల్లో చూసి ఉంటాం. అయితే తాజాగా ఇది నిజ జీవితంలో జ‌రిగింది. అయితే వ‌ధువు కాకుండా వ‌రుడిని కిడ్నాప్ చేశారు. తాజాగా బీహార్‌లో చోటుచేసుకున్న ఒక పెళ్లి కార్యక్రమం వైర‌ల్ అయ్యింది. వివాహ వేదికపైనే కిడ్నాప్ డ్రామా జరగడం అంద‌రినీ షాక్‌కి గురి చేసింది.

వివరాల్లోకి వెళితే... బిహార్ రాష్ట్రంలోని గోపాల్‌గంజ్ జిల్లా కూచి కోట్ గ్రామంలో మే 24 (శనివారం) తెల్లవారు జామున 2 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. ఒక పెళ్లిలో డ్యాన్స్ చేయడానికి ప్రత్యేకంగా మహిళా డ్యాన్సర్లను ఏర్పాటు చేశారు. ఊరేగింపులో డ్యాన్స్‌ జరుగుతుండగా వరుడి కుటుంబ సభ్యులు, ఆ డ్యాన్సర్ల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం ఘర్షణగా మారింది. ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది.

గొడవ పెరిగిపోవడంతో డ్యాన్సర్ల బృందం ఆగ్రహంతో రెచ్చిపోయి వధువు కుటుంబంపై దాడికి దిగారు. పలువురు మహిళలు, వధువు తల్లి తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలోనే కొందరు దుండగులు పెళ్లి వేదికలోకి ప్రవేశించి నగలు, విలువైన వస్తువులు అపహరించడంతో పాటు వరుడిని కూడా కారులో బలవంతంగా కూర్చోబెట్టి అపహరించారు.

ఈ ఘటనపై వెంటనే వరుడి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, వెంట‌నే రంగంలోకి దిగారు. వరుడి కోసం ఏడు గంటల పాటు కొనసాగిన సెర్చింగ్ అనంతరం అతన్ని వెతికి పట్టుకున్నారు. పోలీసులు డ్యాన్సర్ల ముఠాను గుర్తించి, వారినుంచి వరుణ్ని సురక్షితంగా రికవర్ చేసినట్లు సమాచారం. అయితే, ఘటన వెనుక ఉన్న అసలు ఉద్దేశం, కిడ్నాప్‌కు గల కారణాలపై పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News