Car Paint Tips: ఎండకి కారు పెయింట్‌ పాడవకూడదంటే ఈ చిట్కాలు పాటించండి..!

Car Paint Tips: కారు కొనడం చాలా మందికి ఒక కల. అలాంటి వారు కారు కొన్న తర్వాత దానిని చాలా ఇష్టపడతారు.

Update: 2022-06-08 09:30 GMT

Car Paint Tips: ఎండకి కారు పెయింట్‌ పాడవకూడదంటే ఈ చిట్కాలు పాటించండి..!

Car Paint Tips: కారు కొనడం చాలా మందికి ఒక కల. అలాంటి వారు కారు కొన్న తర్వాత దానిని చాలా ఇష్టపడతారు. తమ కారు ఎక్కువ కాలం ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ కొంచెం అజాగ్రత్త కారు మెరుపును పాడు చేస్తుంది. వేసవిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన ఎండ కారు పెయింట్‌పై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీన్ని నివారించడానికి కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.

ఎండలో కారు పార్క్ చేయవద్దు

సూర్యకాంతి కారణంగా కారు పెయింట్ చెడిపోవద్దంటే కారును ఎండలో పార్క్ చేయకూడదు. కారును ఎల్లప్పుడూ నీడలో పార్క్ చేయడానికి ప్రయత్నించండి. ఎక్కువ సేపు ఎక్కడైనా కారును పార్క్ చేయాల్సి వస్తే ఎండ, ధూళి నుంచి రక్షణ పొందేలా కవర్ చేయండి.

కారుపై మైనపు పూత

చాలా మంది కారు పెయింట్‌ను ఎండ నుంచి రక్షించడానికి మైనపు పూత పూస్తారు. ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే మైనపు పూతకి చాలా ఖర్చవతుంది. మార్కెట్లో చాలా కంపెనీల వ్యాక్స్ కోటింగ్ అందుబాటులో ఉంది.

కారును పాలిష్ చేయండి

ఇవి కాకుండా మీరు కారు పెయింట్ పోకూడదనుకుంటే పాలిష్‌ను వేయవచ్చు. ఇది కారు పెయింట్ జీవితాన్ని పొడిగించడంతో పాటు మరింత మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.

Tags:    

Similar News