Viral News: టైగర్ వాటర్‌ఫాల్స్ వద్ద విషాదం.. నీళ్లలో ఎంజాయ్ చేస్తుండగా కూలిన భారీ వృక్షం..
Viral News: ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన చక్రతా టైగర్ వాటర్‌ఫాల్స్ వద్ద పర్యాటకులపై భారీ చెట్టు ఒక్కసారిగా కుప్పకూలింది.
Viral News: టైగర్ వాటర్‌ఫాల్స్ వద్ద విషాదం.. నీళ్లలో ఎంజాయ్ చేస్తుండగా కూలిన భారీ వృక్షం..
Viral News: ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన చక్రతా టైగర్ వాటర్‌ఫాల్స్ వద్ద పర్యాటకులపై భారీ చెట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
సోమవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో, కొండపై నుండి భారీ చెట్టు అకస్మాత్తుగా జలపాతానికి దిగువన స్నానం చేస్తున్న పర్యాటకులపై కూలింది. చెట్టు పడటంతో ఢిల్లీకి చెందిన అల్కా ఆనంద్ (55), స్థానికుడు గీతారామ్ జోషి (48) ప్రాణాలు కోల్పోయారు. చెట్టు కొమ్మలు తగిలి మరో ముగ్గురు పర్యాటకులు స్వల్ప గాయాలపాలయ్యారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. చెట్టు కింద చిక్కుకున్నవారిని బయటకు తీసి చికిత్స కోసం చక్రతా సిహెచ్‌సీకి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించేలోపే ఇద్దరు మరణించారని వైద్యులు ధృవీకరించారు.
గీతారామ్ జోషి (48) — చక్రతాలోని సుజౌ గ్రామానికి చెందిన స్థానికుడు. సెలాకిలోని ఓ కంపెనీలో ఉద్యోగి. అల్కా ఆనంద్ (55) — ఢిల్లీలోని షాహ్దారా ప్రాంతానికి చెందినవారు. తన కుమార్తె, కాబోయే భర్తతో కలిసి పర్యటనకు వచ్చినట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక్కసారిగా చెట్టు కూలటం, పర్యాటకులు పరుగులు తీయడం, సహాయక చర్యలు చేపట్టిన దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి.
చక్రతా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ చంద్రశేఖర్ నౌటియల్ మాట్లాడుతూ, "శవపరీక్షల అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాం. గాయపడినవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు" అని తెలిపారు.