Zydus Cadila Vaccine: త్వరలో అందుబాటులోకి నాలుగో టీకా!

Zydus Cadila Vaccine: కోవిడ్ సెకండ్ వేవ్ తో ఇండియాలో కేసులు భారీగా పెరుగుతున్నాయి.

Update: 2021-05-08 08:10 GMT

జైడస్‌ క్యాడిలా (ఫొటో ట్విట్టర్)

CoronaVaccine: కోవిడ్ సెకండ్ వేవ్ తో ఇండియాలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే వచ్చిన టీకాలు సరిపడక వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొంత ఆలస్యం జరుగుతోంది. అయితే త్వరలోనే మరో వ్యాక్సిన్ అందుబుటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ జైడస్‌ క్యాడిలా ఈమేరకు ఓ టీకాను అభివృద్ధి చేసింది. 'జైకోవ్‌-డి' గా పిలిచే ఈ టీకా వినియోగానికి అనుమతుల కోసం త్వరలోనే దరఖాస్తు చేయనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. మేలోనే అనుమతులు రావొచ్చని జైడస్‌ ఆశగా ఉంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో జైకోవ్‌-డి మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ను జైడస్ క్యాడిలా ప్రారంభించింది. ఇప్పటికే 28వేల మందిపై ప్రయోగాలు చేసినట్లు పేర్కొంది. అయితే ఈ టీకా ఫలితాలు త్వరలోనే రానున్నాయని, అవి రాగానే వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేయనున్నట్లు జైడస్‌ ఎండీ శార్విల్‌ పటేల్‌ వెల్లడించారు. అనుమతులు రాగానే ఉత్పత్తి ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. అయితే, ఇది మూడు డోసులు వేసుకోవాలని పేర్కొంది.

Tags:    

Similar News