వారికి హెచ్చరిక.. ఈ నాలుగు పరిస్థితులలో రేషన్‌ కార్డు రద్దు..!

వారికి హెచ్చరిక.. ఈ నాలుగు పరిస్థితులలో రేషన్‌ కార్డు రద్దు..!

Update: 2022-07-11 13:30 GMT

వారికి హెచ్చరిక.. ఈ నాలుగు పరిస్థితులలో రేషన్‌ కార్డు రద్దు..!

Ration Card: మీరు రేషన్ కార్డ్ హోల్డర్ అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. వాస్తవానికి కరోనా సమయంలో ప్రభుత్వం పేదలకు ఉచిత రేషన్ విధానాన్ని ప్రారంభించింది. అయితే చాలామంది అనర్హులు ఉచిత రేషన్‌ను సద్వినియోగం చేసుకుంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అలాంటి వారి కార్డులని రద్దుచేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది. ఇలాంటి స్వచ్ఛందంగా రేషన్‌ వదులుకుంటే పర్వాలేదు. లేదంటే వెరిఫికేషన్‌ తర్వాత ఆహార శాఖ బృందం కార్డుని రద్దు చేస్తుంది.

కార్డు హోల్డర్ సొంత ఆదాయంతో సంపాదించిన 100 చదరపు మీటర్ల ప్లాట్ / లేదా ఇల్లు, ఫోర్ వీలర్ వాహనం / ట్రాక్టర్, ఆయుధ లైసెన్స్, గ్రామంలో రెండు లక్షల కుటుంబ ఆదాయం, నగరంలో సంవత్సరానికి మూడు లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే తహసీల్‌, డీఎస్‌ఓ కార్యాలయంలో రేషన్‌ కార్డు సరెండర్‌ చేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆహార శాఖ బృందం చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్‌కార్డుదారుడు కార్డును సరెండర్ చేయని పక్షంలో పరిశీలన అనంతరం వారి కార్డును రద్దు చేస్తారు. దీంతో పాటు ఆ కుటుంబంపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు వారి నుంచి తీసుకున్న రేషన్‌ కూడా రికవరీ చేస్తారు.

మరోవైపు ఉచిత రేషన్ పథకం గడువును ఈ ఏడాది మార్చి నెలలో మోడీ ప్రభుత్వం పొడిగించింది. 80 వేల కోట్లతో పేదలకు 5 కిలోల ఆహార ధాన్యాలను ప్రభుత్వం ఆరు నెలల పాటు ఉచితంగా అందజేస్తోంది. ఇంతకు ముందు ఈ పథకం చివరి తేదీ 31 మార్చి 2022. అయితే ఈ పథకాన్ని 30 సెప్టెంబర్ 2022 వరకు పొడిగించారు. పేద వర్గాల ప్రజలు ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

Tags:    

Similar News