Yamuna River: రికార్డు స్థాయిలో యమునా నదికి వరద.. ఢిల్లీని ముంచెత్తిన వరద జలాలు

Yamuna River: యమునా పరివాహక ప్రాంతాలు జలయమం

Update: 2023-07-13 05:21 GMT

Yamuna River: రికార్డు స్థాయిలో యమునా నదికి వరద.. ఢిల్లీని ముంచెత్తిన వరద జలాలు

Yamuna River: ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో యమునా నది మహోగ్రరూపం దాల్చింది. దేశ రాజధాని ఢిల్లీలో గడచిన రెండు రోజుల నుంచి ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోన్న యమున నది.. 45 ఏళ్ల నాటి రికార్డును దాటింది. నది చరిత్రలో మొదటిసారి నీటిమట్టం గరిష్ఠానికి చేరింది. దీంతో ఢిల్లీలోని అనేక కాలనీలు, మార్కెట్లను వరద నీరు ముంచెత్తింది. రాత్రికి ఢిల్లీ పాత రైల్వే వంతెన వద్ద యమునానది నీటి మట్టం 208.05 మీటర్లకు చేరింది. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య ఇది మరింత పెరిగి.. మధ్యాహ్నం 2 గంటల నుంచి తగ్గుముఖం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎగువన హరియాణా ప్రభుత్వం ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తుండడంతో యమునా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నది ప్రమాదకర స్థాయి 205.33 మీటర్లు కాగా రెండు రోజుల కిందటే దానిని దాటేసింది. 207 మీటర్లను దాటడం పదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1978లో నీటి మట్టం 207.49 మీటర్లకు చేరడంతో ఢిల్లీని వరదలు ముంచెత్తాయి. ప్రస్తుతం ఆ రికార్డును కూడా దాటేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల నుంచి 16 వేల మంది ప్రజలను ఖాళీ చేయించి.. సురక్షిత ప్రదేశాలకు తరలించారు. కొన్ని కాలనీల్లోకి వరద నీరు నాలుగు అడుగుల మేర చేరగా.. ఢిల్లీ రోడ్డు రవాణా సంస్థ ప్రధాన కార్యాలయాన్ని నీరు ముంచెత్తింది.

Tags:    

Similar News