Kolkata Doctor Rape And Murder Case: ధర్నాల పేరుతో బాయ్‌ఫ్రెండ్స్‌ని కలుస్తున్నారు
Kolkata Doctor Rape And Murder Case: ఓవైపు కోల్‌కతాలోని ఆర్.జి. కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో పీజీ ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతుంటే, మరోవైపు డాక్టర్లను రెచ్చగొట్టేలా టీఎంసీ ఎంపీ వ్యవహరించిన తీరుకు సంబంధించిన వార్త ఇది.
Kolkata Doctor Rape And Murder Case
women doctors Meeting Boyfriends: కోల్‌కతాలోని ఆర్.జి. కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో 31 ఏళ్ల పీజీ ట్రైనీ డాక్టర్‌ని రేప్ చేసి హత్య చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. కోల్‌కతాలో ఈ నిరసనల హోరు మరింత అధికంగా ఉంది. వైద్య సేవలు నిలిపివేసి ఎక్కడికక్కడ భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ధర్నాలకు దిగుతున్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు ఇకపై వైద్యులపై ఎలాంటి దాడులు జరగకుండా కఠిన చట్టాలు తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలావుంటే, తాజాగా ఈ అంశంపై అదే పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ అరూప్ చక్రవర్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ధర్నాలు, ఆందోళనల పేరుతో మహిళా డాక్టర్లు ఇళ్లకు వెళ్తున్నారు, ఇంకొంతమంది వారి బాయ్ ఫ్రెండ్స్ వద్దకు వెళ్తున్నారని మండిపడ్డారు. " డాక్టర్లు ఇలా వైద్య సేవలను బాయ్‌కాట్ చేసిన కారణంగా ఎవరైనా పేషెంట్ చనిపోయి, వారి బంధువులు మీపై పడితే.. అప్పుడు మిమ్మల్ని మేము కూడా రక్షించలేం" అని హెచ్చరించారు.
ఆందోళనలో పాల్గొంటున్న డాక్టర్లని ఉద్దేశించి అరుప్ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం స్థానికంగా పెనుదుమారం రేపుతున్నాయి. పశ్చిమ బెంగాల్ బంకురాలో జరిగిన ఓ పబ్లిక్ ర్యాలీలో పాల్గొని మాట్లాడుతూ అరుప్ చక్రవర్తి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. అరుప్ చక్రవర్తి వ్యాఖ్యలపై డాక్టర్లు సైతం అంతే ఘాటుగా స్పందిస్తున్నారు. తమపై బెదిరింపులకు పాల్పడటం మానేసి బాధితురాలికి న్యాయం చేసేందుకు ప్రయత్నించండి అంటూ ఎంపీ అరుప్ చక్రవర్తికి హితవు పలుకుతున్నారు.