ఎఫైర్.. మహిళను చంపి నది ఒడ్డున పాతిపెట్టిన ప్రియుడు..
Woman Killed In Affair: కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. వర్షాలకు నదిలో నీరు పెరగడంతో సువర్ణవతి నది ఒడ్డున పాతిపెట్టిన మహిళ మృతదేహం బయటకు వచ్చేసింది.
ఎఫైర్.. మహిళను చంపి నది ఒడ్డున పాతిపెట్టిన ప్రియుడు..
Woman Killed In Affair: కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. వర్షాలకు నదిలో నీరు పెరగడంతో సువర్ణవతి నది ఒడ్డున పాతిపెట్టిన మహిళ మృతదేహం బయటకు వచ్చేసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, కేసులో సంచలన విషయాలను బయటపెట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలు 29 ఏళ్ల సోనాక్షి, కొళ్లేగాలలో నివసిస్తూ, స్థానికుడైన విజయ్ కుమార్ భార్యగా ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఆమె గత కొంతకాలంగా మహేష్ బాబు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో భర్త, పిల్లలను వదిలి ప్రేమికుడితో వెళ్లిపోయినట్లు సమాచారం.
అయితే, కొంతకాలానికే సోనాక్షి మరో వ్యక్తితో మరో ప్రేమ సంబంధం పెట్టుకోవడం మొదలుపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు, వెంటనే ఆమె కుటుంబానికి విషయం చెప్పడంతో ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది.
నాలుగు రోజుల క్రితం, మహేష్ బాబు సోనాక్షిని ఇంటికి పిలిచి, ఆగ్రహంతో తలపై బలంగా కొట్టి, అక్కడికక్కడే హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని సువర్ణవతి నది ఒడ్డుకు తీసుకెళ్లి పూడ్చిపెట్టాడు.
వర్షాల కారణంగా గట్టు పాడవడంతో మృతదేహం వెలుగులోకి వచ్చింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు, విచారణ కొనసాగుతోందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.