భూకంపాలు ఎందుకు వస్తాయి? పిల్లులు భూకంపాలను ముందే పసిగడుతాయా?

డిల్లీ , బీహార్ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 17 ఉదయం 8.02 గంటల ప్రాంతంలో భూకంపం వచ్చింది. రెక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.0 గా నమోదైంది.

Update: 2025-02-17 06:31 GMT

   భూకంపాలు ఎందుకు వస్తాయి? 

డిల్లీ , బీహార్ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 17 ఉదయం 8.02 గంటల ప్రాంతంలో భూకంపం వచ్చింది. రెక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.0 గా నమోదైంది. సివాన్‌లో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు తెలిపారు. అసలు భూకంపాలు ఎందుకు వస్తాయి? తెలుసుకుందాం.

భూకంపాలు ఎందుకు వస్తాయి?

భూమి లోపలి పొరల్లో అలజడి వచ్చినప్పుడు ఏర్పడే కంపనాలు ఉపరితలాన్ని చేరడాన్ని భూకంపం అంటారు. భూ ఉపరితల భూభాగం కొన్ని పొరలతో ఉంటుంది. భూమి లోపల ఉన్న పలకల కదలికల వల్ల కొన్ని ప్రాంతాల్లో తరచుగా భూకంపాలు రావడానికి ఛాన్స్ ఉంది. భూమి లోపల ఉండే ఒక పొర 50 కి.మీ. ఉంటే ఆ పొరను క్రెస్ట్‌ లేదా లిథోస్పియర్ అంటారు. దాని కింద పొరను మాంటక్ అంటారు. దీని మందం మూడు కి.మీ.ఉంటుంది. ఇలాంటి పొరలతో పాటు చిన్న చిన్న పొరలు కూడా ఉంటాయి. ఇలా భూమి లోపల 12 పొరలుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లావా ఒత్తిడి, ఉష్ణోగ్రతలకు ఈ శిలాఫలకాల్లోని కొన్ని భాగాల్లో సమస్యలు ఏర్పడడంతో శిలాఫలాకాలు ఒకదానికొకటి నెడతాయి. ఈ శిలాఫలకాల్లో పగుళ్లు ఏర్పడి భూంకపాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

భూకంప తీవ్రతను ఎలా గుర్తిస్తారు?

భూకంపతీవ్రతను రిక్టర్ స్కేల్ ద్వారా గుర్తిస్తారు. 1935లో ఛార్లెస్ రిక్టర్ ఈ రిక్టర్ స్కేల్ ను కనిపెట్టారు. అందుకే దీనిని రిక్టర్ స్కేల్ గా పిలుస్తారు. భూకంపం వల్ల వచ్చే శక్తి 3 వేల 800 లీటర్ల పెట్రోల్ ఇచ్చే శక్తికి సమానమని చెబుతారు. సాధారణ భూకంపం రిక్టర్ స్కేల్ పై 2.5 కు సమానం.

అడవుల నరికివేత కూడా భూకంపాలకు కారణమా?

భూకంపాలు రావడానికి అనేక కారణాలను శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో నీటి నిల్వ కూడా పరోక్షంగా భూకంపాలకు కారణంగా మారుతోంది. ప్రాజెక్టుల్లోని నీటి ఒత్తిడి భూమి లోపల పొరల్లో మార్పులకు కారణమయ్యే అవకాశం ఉంది. భూమి తన చుట్టూ తిరుగుతున్న సమయంలో భూమి అంతర్గత పొరల్లో సర్దుబాటు కూడా భూకంపాలకు కారణమౌతున్నాయి.అడవుల్లో చెట్లను నరికివేయడం వల్ల భూకంపాలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

భూకంపాలను ముందుగా ఏ జంతువులు గుర్తిస్తాయి

భూకంపాలను పాములు, పిల్లులు, పశువులు ముందుగా గుర్తిస్తాయి. ప్రపంచంలో 68 శాతం భూకంపాలు పసిఫిక్ మహాసముద్రం, 21 శాతం మధ్యధరా ప్రాంతంలో సంభవిస్తాయి. 11 శాతం ఇతర ప్రాంతాల్లో ఇవి వస్తున్నాయి. అస్ట్రేలియా భూకంపాలు ఇంతవరకు గుర్తించలేదు.

భూకంప తీవ్రత ఎంత ఉంటే నష్టం ఎక్కువ

ప్రతి రోజూ భూమి కంపిస్తూనే ఉంటుంది. అయితే ఇది మనిషి గుర్తించలేడు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.5 కంటే తక్కువగా ఉంటే గుర్తించడం సాధ్యం కాదు. 3.5 నుంచి 5.4 గా భూకంప తీవ్రత ఉంటే ఇంట్లోని కిటీకీలు కదులుతాయి. ఇక రిక్టర్ స్కేల్ పై 6 తీవ్రత నమోదైతే భవనాలలు దెబ్బతింటాయి. 6.1 నుంచి 6.9 రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత నమోదైన ప్రాంతంలో దీని తీవ్రత 100 కి.మీ. వైశాల్యం వరకు ఉంటుంది. ఇక భూకంప తీవ్రత 7 నుంచి 7.9 గా ఉంటే ఆస్తి, ప్రాణ నష్టం పెద్ద ఎత్తున ఉంటుంది. 8 కంటే వచ్చే భూకంప తీవ్రత తీవ్ర విధ్వంసానికి దారి తీసే అవకాశం ఉంటుంది.

ఇండియాలో భూకంపాలు ఎక్కువగా ఎక్కడ వస్తాయి?

ఇండియాలో ఎక్కువగా హిమాలయ పర్వతాల్లో భూకంపాలు వస్తాయి. దీని ప్రభావం గుజరాత్, అసోం, మహారాష్ట్ర, జమ్మూ, బీహార్ రాష్ట్రాలపై పడుతోంది. దేశంలోని జోన్ ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తాయి. ఈశాన్య రాష్ట్రాలు, బీహార్, ఉత్తర జమ్మూ, పశ్చిమ గుజరాత్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ , ఉత్తరాఖండ్ రాష్ట్రాలు  ఐదవ జోన్ లో ఉన్నాయి.

Similar News