కరోనా సోకినా ఇంట్లోనే ఉంచి చికిత్సలు.. మమతా బెనర్జీ నిర్ణయంపై సర్వత్ర విస్మయం

దేశంలో కరోనా వేగంగానే వ్యాపిస్తుంది. ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,396 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Update: 2020-04-27 14:34 GMT
Mamata Benarjee (File Photo)

దేశంలో కరోనా వేగంగానే వ్యాపిస్తుంది. ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,396 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ 649 మందికి కరోనా సోకింది. ఈ వ్యాధి బారిన పడి 20 మంది మృత్యువాపడ్డారు. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ పాజిటివ్ గా వచ్చినా ఇంట్లోనే క్వారంటైన్ చేసుకునే వీలుంటే, ఆసుపత్రులకు రావాల్సిన అవసరం లేదని ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసారు.

పాజిటివ్ గా తేలినవారు ఇంట్లోనే ఉండి చికిత్సలు పొందతేలినవచ్చని సీఎం మమతా బెనర్జీ సూచించారు. రాష్ట్రంలో లక్షల మందికి వైరస్ సోకితే, వారందరిని ప్రభుత్వ క్వారంటైన్ లో ఉంచి చికిత్సలు అందించే పరిస్థితి లేదని, ఏ ప్రభుత్వానికైనా కొన్ని పరిమితులు ఉంటాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మమతా బెనర్జీ వెల్లడించారు.

కాగా, మమతా బెనర్జీ ప్రకటించిన నిర్ణయంపై సర్వత్ర విస్మయం వ్యక్తమవుతోంది. వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వినియోగిస్తే, కరోనా రోగి ఇంట్లోనే ఉండి కూడా కోలుకునే అవకాశాలు ఉన్నప్పటికీ, కరోనా పాజిటివ్ రోగి ఇంట్లోనే ఉంటే, వారి కుటుంబీకులకు కూడా వైరస్ సోకే ప్రమాదం ఎంతో ఎక్కువగా ఉంటుందని పలువురు అంటున్నారు. హోం క్వారంటైన్ లో కరోనా సోకిన రోగి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, మొత్తం కుటుంబానికి వ్యాధి సోకుతుందనడంలో సందేహం లేదు.

భారత్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 27,892కి చేరుకుంది. వీటిలో 20,835 యాక్టివ్ కేసులు ఉండగా... 6,185 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం మరణాల సంఖ్య 872కి చేరింది. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.


Tags:    

Similar News