Heavy Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

Update: 2020-07-24 08:29 GMT

Heavy Rains in Telugu States: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అన్నారు. అంతేకాదు ఒకటిరెండు చోట్ల అతిభారీ వర్షాలు కూడా కురుస్తాయని వెల్లడించారు. నది పరివాహకప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్సకారులు సమయం చూసుకొని తమ ఇళ్లకు వెళ్లాలని చెప్పారు. అటు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కొనసాగుతున్న తరుణంలో రానున్న 72 గంటల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ఇక విశాఖలో రెండు గంటలపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో రోడ్లమీద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. మాస్కు లేకుండా బయటకు రావొద్దని వీలైనంతవరకు వర్షంలో తడవ వద్దని చెప్పారు. కాగా ఏపీలో గత 24 గంటల్లో 58052 సాంపిల్స్‌ ని పరీక్షించగా 7,998 మంది కోవిడ్‌19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. కొత్తగా 5, 428 మంది కోవిడ్‌ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్‌ అయిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News