11A Number Seat Demand: విమానంలో 11ఎ నెంబర్ సీటుకు డిమాండ్ పెరిగింది?..ఈ నెంబరైతేనే సేఫ్‌గా ఉంటామంటున్న ప్యాసెంజర్లు
11A Number Seat Demand: అహ్మదాబాద్‌లో గురువారం మధ్యాహ్నం జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదంలో విమానంలో ఉన్న ప్రయాణికులలో 241 మంది చనిపోగా ఒక్కరు మాత్రం బయటపడ్డారు.
11A Number Seat Demand: విమానంలో 11ఎ నెంబర్ సీటుకు డిమాండ్ పెరిగింది?..ఈ నెంబరైతేనే సేఫ్‌గా ఉంటామంటున్న ప్యాసెంజర్లు
అహ్మదాబాద్‌లో గురువారం మధ్యాహ్నం జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదంలో విమానంలో ఉన్న ప్రయాణికులలో 241 మంది చనిపోగా ఒక్కరు మాత్రం బయటపడ్డారు. అయనే విశ్వాస్ రమేష్. ఇతను బ్రిటీష్...ఇండియన్. ఇండియాకి వచ్చి బంధువులను కలిసి తిరిగి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అతనితోపాటు అతని అన్నయ్య కూడా ఈ విమానంలో ఉన్నాడు. కానీ అతను ఈ ప్రమాదంలో చనిపోయాడు. అయితే విశ్వాస్ ఒక్కడే బయటపడడంతో ఇప్పుడు అతను ప్రయాణించిన 11ఎ నెంబర్ సీటుకు డిమాండ్ పెరిగింది.
ఈ 11ఎ నెంబర్ సీట్ లో కూర్చుంటే ఏ ప్రమాదం జరిగినా సేఫ్‌గా ఉంటామని ప్రయాణికులు నమ్ముతున్నారు. ఇదొక లక్కీ సీట్‌గా భావిస్తున్నారు. ఈ సీటులో కూర్చుంటే ధీమాగా ఎక్కడికైనా వెళ్లిపోవచ్చని నమ్ముతున్నారు.
విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోనే ఒక మెడికో హాస్టల్‌ని ఢీకొట్టింది. ఈ సమయంలో విమానం రెండు ముక్కలుగా విడిపోయింది. ఇందులో ఒక భాగం పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయింది. అందుకే అక్కడున్నవారంత చనిపోయారు. ఆ తర్వాత ఇంకో భాగానికి పెద్దగా మంటలు అంటుకోలేదు. దీంతో ఈ 11ఎ సీటులో ఉన్న విశ్వాస్ ఇంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాతకూడా మెల్లగా నడుచుకుంటూ బయటకు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక విమానంలో టికెట్ బుక్ చేసుకుంటే ఈ 11ఎ నెంబర్ సీట్‌నే బుక్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది 11ఎ సీటుకు బుంకింగ్స్ పెరుగుతున్నట్టు కూడా విమానయాన సంస్థల వర్గాలు చెబుతున్నాయి.