Vikas Dubey Arrest : యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

Update: 2020-07-09 06:50 GMT

Vikas Dubey Arrest : రౌడీ షీటర్ వికాస్ దూబే అరెస్ట్ పై యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వికాస్ దూబే స్వయంగా పోలీసులకు లొంగిపోయాడా? లేదా పోలీసులు పట్టుకున్నారా ? అంటూ ట్వీట్ చేశారు అఖిలేష్ యాదవ్. వికాస్ దూబే కాల్ డాటా రికార్డ్ పోలీసులు బయట పెట్టాలని డిమాండ్ చేశారు అఖిలేష్ యాదవ్. కాన్పూర్ గ్యాంగస్టర్ వికాస్ దూబే అరెస్టయ్యాడు. 8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న కిరాతక రౌడీని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు యూపీ పోలీస్ వర్గాలు తెలిపాయి. ఉజ్జయినిలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్ర పోలీసుల పనితీరుపై తీరుపై యూపీ సీఎం యోగి ఆధిత్యనాధ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వికాస్ దూబే మధ్యప్రదేశ్ పోలీసులకు చిక్కడం పై రాష్ట్ర పోలీసుల వైఫల్యంగా భావిస్తున్న యూపీ సీఎం, అత్యవసరంగా సీఎం కార్యాలయానికి రావాల్సిందిగా సీనియర్ పోలీసు అధికారులకు యోగి ఆధిత్యనాధ్ ఆదేశించారు. వికాస్ దూబేను తామే సీసీటీవీ పుటేజ్ ద్వారా గుర్తించినట్లు ఉజ్జయిని మహాంకాళి ఆలయ అధికారులు వెల్లడించారు. తమ భద్రతా సిబ్బంది వికాస్ దూబే ను పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారని ఆలయ అధికారులు తెలిపారు. తన అనుచరులు ఒక్కొక్కరు పోలీసుల ఎన్ కౌంటర్ లో మృతిచెందడంతో తనను కూడా పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తారన్న భయంతో వికాస్ దూబే లొంగిపోయాడని సమాచారం.

Tags:    

Similar News