Wakes Up Moments Before Cremation: అంత్యక్రియల సమయంలో అద్భుతం..యమపురికి వెళ్లి వెనక్కి వచ్చాడు!

Man Wakes Up Moments Before Cremation: హర్యానాలో సంచలనం.. శ్మశానానికి తీసుకెళ్తుండగా ఊపిరి తీసిన వృద్ధుడు.. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

Update: 2025-07-18 02:30 GMT

Wakes Up Moments Before Cremation: అంత్యక్రియల సమయంలో అద్భుతం..యమపురికి వెళ్లి వెనక్కి వచ్చాడు!

Man Wakes Up Moments Before Cremation:  ఒక కుటుంబం కన్నీరులో మునిగి చివరి వీడ్కోలు కోసం సిద్ధమవుతోంది. చితి సిద్ధమైంది. మృతదేహానికి స్నానం చేయిస్తుండగా, ఒక్కసారిగా కళ్లు తెరచి దగ్గిన మృతుడు! ఇది సినిమా సీన్ కాదు.. యథార్థంగా హర్యానాలోని యమునానగర్ జిల్లాలో చోటుచేసుకున్న అపూర్వ ఘటన ఇది.

మరణించినట్లు వైద్యుల ధ్రువీకరణ

కోట మజ్రి గ్రామానికి చెందిన 75 ఏళ్ల షేర్ సింగ్ గత కొంతకాలంగా అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న షేర్ సింగ్ అప్పటికే మృతి చెందాడని వైద్యులు ప్రకటించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఇంటికి ఫోన్ చేసి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

చితి వద్ద ఒక్కసారిగా కళ్లు తెరిచిన వృద్ధుడు

షేర్ సింగ్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. బంధువులు, మిత్రులు చేరుకున్నారు. శ్మశానానికి చేరి కలపను సిద్ధం చేశారు. సంప్రదాయం ప్రకారం మృతదేహానికి స్నానం చేయించే సమయంలో, ఆయన ముఖానికి ఉన్న వెంటిలేటర్ పైప్ తీసివేయగానే షేర్ సింగ్ ఒక్కసారిగా దగ్గుతూ కళ్లు తెరిచారు! ఈ దృశ్యం చూసిన వారంతా అవాక్కయ్యారు.

ఆసుపత్రికి తరలింపు.. ఆరోగ్యం నిలకడగా

ఈ ఘటనతో హతాశమైన కుటుంబం ఆనందంతో ఉప్పొంగిపోయింది. వెంటనే షేర్ సింగ్‌కు నీళ్లు తాగించి, మళ్లీ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సమాచారం మేరకు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

"ఇది దేవుడి దయ": గ్రామ సర్పంచ్

గ్రామ మాజీ సర్పంచ్ రంజిత్ సింగ్ మాట్లాడుతూ – “వెంటిలేటర్ పైప్ తీసిన వెంటనే షేర్ సింగ్ ఊపిరి పీల్చడం చూసి ఆశ్చర్యానికి గురయ్యాం. ఇది నిజంగా దేవుని కృప,” అని పేర్కొన్నారు. అంత్యక్రియల కోసం వచ్చిన బంధువులు షేర్ సింగ్ తిరిగి బతికిన సంఘటనతో సంతోషం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News