వీడ్కోలు కార్యక్రమంలో వెంకయ్య భావోద్వేగ ప్రసంగం

Venkaiah Naidu: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తన వీడ్కోలు కార్యక్రమంలో భావోద్వేగ ప్రసంగం చేశారు.

Update: 2022-08-08 15:00 GMT

వీడ్కోలు కార్యక్రమంలో వెంకయ్య భావోద్వేగ ప్రసంగం

Venkaiah Naidu: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తన వీడ్కోలు కార్యక్రమంలో భావోద్వేగ ప్రసంగం చేశారు. ప్రపంచం మొత్తం భారతదేశాన్ని చూస్తోందని, ఎగువ సభ మరింత గొప్పగా బాధ్యతను కలిగి ఉందనీ ఆయన అభిప్రాయపడ్డారు. ఎంపీలు సభ గౌరవాన్ని కాపాడాలని వెంకయ్య సూచించారు. సభలో నిర్మాణాత్మక చర్చలు జరగాలన్నారు. ప్రజాస్వామ్యం విలువ మరింత పెరిగేలా నడుచుకోవాలని చెప్పారు. సభలో మాతృభాషలో మాట్లాడేందుకు తన వంతుగా ప్రోత్సహించాననీ తెలిపారు. రాజ్యసభ నిర్వహణకు తనవంతుగా కృషి చేశానన్నారు. దేశం నలుదిక్కులా, ప్రతీ ఒక్క సభ్యుడికీ సమయం ఇచ్చాననీ వెల్లడించారు. సభ గౌరవం కాపాడేందుకు కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించానన్నారు.

Tags:    

Similar News