వందే భారత్ తరహాలోనే వందే మెట్రో రైళ్లు

* కసరత్తు చేస్తోన్న భారత రైల్వే శాఖ

Update: 2023-02-08 02:12 GMT

వందే భారత్ తరహాలోనే వందే మెట్రో రైళ్లు

Vande Metro: దేశంలో అత్యంత వేగవంతమైన ప్రయాణం చేయడానికి ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు పట్టాలెక్కేశాయి. కీలక మార్గాల్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా మరిన్ని రూట్లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ‌్లు అందుబాటులోకి రాబోతున్నాయి. వీటికి అదనంగా వందే భారత్ తరహాలోనే వందే మెట్రో సర్వీసులను కూడా తీసుకురాబోతోంది భారత రైల్వే శాఖ.

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనంగా వందేభారత్ తరహాలోనే వందే మెట్రో సర్వీసులను కూడా తీసుకురాబోతోంది ఇండియన్ రైల్వేస్. నగరాలకు సమీపంలో ఉన్న ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు... వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకి మినీ వెర్షనే. ఈ వందే మెట్రో రైలు ఈ ఏడాది చివరి నాటికి వందే మెట్రో డిజైన్, ప్రొడక్షన్ పూర్తి కానుంది. శివారు ప్రాంత ప్రజలను నగరాలతో కనెక్ట్ చేయడమే వందే మెట్రో సర్వీస్ లక్ష్యం. పెద్ద నగరాల చుట్టు పక్కల ప్రాంతాల్లో వందే మెట్రో సర్వీసులు తీసుకురానున్నారు.

నగరాలకు రాకపోకలను సులభతరం చేసేందుకే వందే మెట్రో రైళ్లను ప్రారంభించనున్నామని, దీంతో తక్కువ సమయంలో గమ్యాన్ని చేరుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు వందే మెట్రో రూట్‌లో చిన్న స్టేషన్లు కవర్ కానున్నాయి. 60 - 70 కిలో మీటర్ల మధ్య ఉన్న పట్టణాల మధ్య ఈ వందే మెట్రో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వీటి ఉత్పత్తికి సంబంధించి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News