Uttarakhand Avalanche: మంచుచరియలు విరిగిపడిన ఘటనలో ఐదుగురు మృతి

Update: 2025-03-02 08:15 GMT

Uttarakhand Avalanche: మంచుచరియలు విరిగిపడిన ఘటనలో ఐదుగురు మృతి

Uttarakhand Avalanche latest news updates: ఉత్తరాఖండ్‌లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్యకు ఐదుకు పెరిగింది. కొద్దిసేపటి క్రితమే మరొక కార్మికుడి మృతదేహాన్ని వెలికి తీయడంతో ఈ సంఖ్య ఐదుకు చేరింది. ఇంకా మరో ముగ్గురు కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇండో టిబెటన్ బార్డర్‌లో పనిచేస్తోన్న బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సిబ్బంది కంటైనర్లలో బసిచేసిన సమయంలో ఈ ఘటన జరిగింది. 50 మందికిపైనే కార్మికులు మంచు చరియల కింద చిక్కుకున్నారు. వారిని రెస్క్యూ బృందాలు అతి కష్టం మీద కాపాడి వెలికి తీసుకొచ్చాయి.

ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి రెస్క్యూ ఆపరేషన్‌ను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. డియన్ ఆర్మీ, ఇండోటిబెటన్ బార్డర్ పోలీసు ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఉత్తరాఖండ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి.

బద్రినాథ్ ఆలయానికి 5 కిమీ దూరంలోని మన గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇండో టిబెటన్ బార్డర్‌లో ఇదే చివరి గ్రామం. దాదాపు 3 వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రదేశం కావడంతో పాటు భారీగా మంచు కురుస్తుండటం సహాయ చర్యలకు అడ్డంకిగా మారింది. అయినప్పటికీ రెస్క్యూ బృందాలు మంచు చరియల కింద చిక్కుకున్న బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సిబ్బంది కోసం ముమ్మరంగా గాలిస్తూనే ఉన్నాయి.  

Tags:    

Similar News