అందుకే అర్ధరాత్రి అంత్యక్రియలు.. యూపీ ప్రభుత్వం వివరణ

Hathras Case : హత్రాస్ ఘటనలో భాదితురాలి మృతదేహాన్ని అర్ధరాత్రి దహనం చేయడం పట్ల గల కారణాలను సుప్రీం కోర్టుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వివరించింది.

Update: 2020-10-06 08:44 GMT

Hathras case

Hathras Case : హత్రాస్ ఘటనలో భాదితురాలి మృతదేహాన్ని అర్ధరాత్రి దహనం చేయడం పట్ల గల కారణాలను సుప్రీం కోర్టుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వివరించింది. మరుసటి రోజున భారీ ఎత్తున శాంతి భద్రతలకి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ వర్గాల నివేదికతో, తాము అర్ధరాత్రి దహన సంస్కారాలు నిర్వహించమని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ మొత్తం అంశానికి కులం, మతం రంగు పులిమి దానిని స్వప్రయోజనాలకు ఉపయోగించే ప్రయత్నం జరుగుతోందని కూడా నివేదికలో వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఉదయం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచేలా దుర్మార్గపు ప్రచారం జరుగుతున్నట్లుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పేర్కొంది.

హత్రాస్ లోని 19 ఏళ్ల యువతి పైన నలుగురు ఉన్నత వర్గానికి చెందిన యువకులు అత్యాచారం చేశారు. దీనితో యువతిని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ ఆ యువతి చికిత్స పొందుతూ సెప్టెంబర్ 29 న తుదిశ్వాస విడిచింది. ఈ సంఘటన తరువాత బాధితురాలిని ఉత్తరప్రదేశ్ పోలీసులు కుటుంబ అనుమతి లేకుండా రాత్రి 2:30 గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహించిన సంగతి తెలిసిందే.. దీనితో పోలిసుల తీరుపైన భాదితురాలు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇక బాధితురాలి కుటుంబాన్ని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, భీమ్ ఆర్మీకి చెందిన చంద్రశేఖర్ ఆజాద్ తదితరులు సందర్శించారు. ఇక ఈ కేసును సీబీఐ కి అప్పగిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

Tags:    

Similar News