అత్యాచార ఘటనలు : బీజేపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు!

అత్యాచార ఘటనలు : బీజేపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు!
x

BJP MLA Surendra Singh

Highlights

BJP MLA Surendra Singh Controversial : ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. బాధితురాలుకి న్యాయం చేయాలనీ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

BJP MLA Surendra Singh Controversial : ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. బాధితురాలుకి న్యాయం చేయాలనీ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాకుండా మళ్ళీ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ వివదాస్పద వాఖలు చేశారు. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న అయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

రామ రాజ్యం కొనసాగుతున్నప్పటికీ అత్యాచారం కేసులు ఎందుకు కొనసాగుతున్నాయని మీరు అనుకుంటున్నారు అని ఓ మీడియా సమావేశంలో విలేఖరి అడిగిన ప్రశ్నకి అయన సమాధానం ఇస్తూ.. 'కూతుళ్లకు మంచి బుద్ధులు చెప్పాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులు పైన ఉంది. వారికి సంస్కృతి, సంప్రదాయాలు నేర్పాలి. అప్పుడే అత్యాచారాలు తగ్గుతాయి' అని అయన అన్నారు.

"నేను ఎమ్మెల్యేనే కాకుండా ఓ ఉపాధ్యాయుడిని కూడా. ఇటువంటి సంఘటనలు సంస్కారంతోనే తగ్గుతాయి. కానీ ప్రభుత్వ పాలనతో కాదు. ప్రభుత్వం మహిళలను రక్షించేందుకు కట్టుబడి ఉంది. అలాంటి సమయంలో తల్లిదండ్రులు అమ్మాయిలకు సంస్కారం నేర్పాలి. ఇంతకుమించి ప్రత్యామ్నాయం లేదు" అని అయన వాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సురేంద్ర సింగ్‌ గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. గత ఏడాది మహాత్మా గాంధీని చంపిన నాథురామ్ గాడ్సే ఉగ్రవాది కాదని అతను చేసింది చిన్న తప్పే నని అన్నారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పైన వ్యాఖ్యానిస్తూ, ఆమె క్రూరమైన మహిళ అని అభివర్ణించారు.

ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేయడంతో ఈ కేసును సెంట్రల్ బ్యూరో దర్యాప్తుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిఫారసు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories