Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్ అలీగఢ్ ఎంపీ అభ్యర్థి కేశవ్ దేవ్ వినూత్న ప్రచారం
Uttar Pradesh: కేశవ్ దేవ్‌కు ఎన్నికల గుర్తుగా చెప్పులు
Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్ అలీగఢ్ ఎంపీ అభ్యర్థి కేశవ్ దేవ్ వినూత్న ప్రచారం
Uttar Pradesh: ఎన్నికల ప్రచారంలో నేతలు వినూత్న పోకడలను అనుసరిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఒకరు రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్‌లో పూరీలు చేస్తే... మరొకరు కూరగాయల దుకాణంలో కూరగాయలు అమ్ముతున్నారు. ఇంకొకరు టీ కొట్టులో టీ పోస్తున్నారు. ఇలా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయా పార్టీల అభ్యర్థులు వింత ప్రచారంతో పోటీ పడుతున్నారు.
జనాల మెప్పు, మార్కుల కోసం నేతలపడే పాటు అన్నీ..ఇన్నీ కావు. ఎన్నికల వేళ అభ్యర్థులు ఓట్ల వేటలో తీవ్రంగా శ్రమిస్తూ ప్రచారంలో వింత పదనిసలు పలికిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ అలీగఢ్ లోక్‌సభ అభ్యర్థిగా పండిట్ కేశవ్ దేవ్ బరిలో దిగారు. తనకు కేటాయించిన గుర్తుతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మెడలో చెప్పులదండ వేసుకుని వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లకు గుర్తుండేందుకే వినూత్న ప్రచారమని పండిట్ కేశవ్ దేవ్ చెబుతున్నారు.