Anurag Thakur: లేహ్ ఖరూలో సైకిల్ ర్యాలీ ప్రారంభించిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
* లడక్ సైక్లింగ్ అసోసియేషన్ సహకారంతో కార్యక్రమం * సముద్రమట్టానికి 11వేల అడుగుల ఎత్తులో సైకిల్ ర్యాలీ
అనురాగ్ ఠాకూర్ సైకిల్ ర్యాలీ (ట్విట్టర్ ఫోటో)
Anurag Thakur: లేహ్ ఖరూలో కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. లడక్ సైక్లింగ్ అసోసియేషన్ సహకారంతో లఢఖ్ పోలీసులు నిర్వహించిన సైకిల్ ర్యాలీలో స్వయంగా పాల్గొన్న మంత్రి ఫిట్‌నెస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 2019లో ప్రధాని మోడీ ఫిట్ ఇండియా క్యాంపెయిన్ ప్రారంభించారన్నారు. లేహ్ వాసులు ర్యాలీలో పాల్గొనడంపై అనురాగ్ ఠాకూర్ హర్షం వ్యక్తం చేశారు. సముద్రమట్టానికి 11వేల అడుగుల ఎత్తులో కార్యక్రమాన్ని నిర్వహించిన లఢఖ్ పోలీసులు, అసోసియేసన్‌ను మంత్రి అభినందించారు.