Union Minister Prakash javadekar: సినీ ఇండస్ట్రీకి కేంద్రం తీపి కబురు!

Union Minister Prakash javadekar: మూడు నెలల లాక్ డౌన్ వలన సినిమా ఇండస్ట్రీ ఘోరంగా నష్టపోయింది. సినిమా షూటింగ్ లు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.

Update: 2020-07-07 15:30 GMT
Prakash Javadekar (File Photo)

Union Minister Prakash javadekar: మూడు నెలల లాక్ డౌన్ వలన సినిమా ఇండస్ట్రీ ఘోరంగా నష్టపోయింది. సినిమా షూటింగ్ లు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. అటు ధియేటర్లు కూడా మూత పడ్డాయి. దీనితో ఇండస్ట్రీ కొన్ని కోట్ల నష్టపోయింది. ఇక కేంద్రం లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ అందులో సినీ పరిశ్రమకి ఊరట లభించలేదు.. అయితే నిలిచిపోయిన సినిమా షూటింగ్ లను త్వరలోనే తిరిగి ప్రారంభించడానికి అవసరమైన మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు కేంద్ర సమాచార మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌‌ వెల్లడించారు.

తాజాగా ముంబయిలో నిర్వహించిన 'ది ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్ ఇండస్ట్రీ' (ఫిక్కీ) 21వ వార్షిక సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. సినిమా, టీవీ, గేమింగ్‌ వంటి వివిధ విభాగాలకు వేర్వేరు మార్గదర్శకాలు విడుదల చేస్తామని అన్నారు. ఇక చిత్ర పరిశ్రమ పైన మరింతగా పెట్టుబడి పెట్టేందుకు వ్యాపారవేత్తలు ముందుకు రావాలని అయన కోరారు. కేంద్ర మంత్రి చేసిన ప్రకటనతో సినిమా రంగానికి మళ్లీ మంచి రోజులు రానున్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక దేశంలో లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. డిచిన 24 గంటల్లో భారత్‌లో 22,771 కేసులు నమోదు కాగా, 467 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 7,19,665 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,59,557 ఉండగా, 4,39,947 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 20,160 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,41,430 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 1,02,11,092 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.


Tags:    

Similar News