Vinesh Phogat: వినేశ్ ఫొగాట్ అనర్హతపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
Vinesh Phogat: లోక్‌సభలో మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటన
Vinesh Phogat: రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించిన వినేశ్ ఫొగాట్
Vinesh Phogat: వినేశ్ ఫొగాట్ అనర్హతపై కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. దీనిపై లోక్‌సభలో క్రీడల శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ప్రకటన చేశారు. ఇదే అంశంపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చీఫ్ పీటీ ఉషకు ఫోన్ చేశారు. వినేష్ అనర్హతకు దారితీసిన పరిస్థితిపై ఆరా తీశారు. దీన్ని సవాల్ చేసేందుకు ఉన్న మార్గాలేంటని.. అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ముందు భారత్ నిరసనను.. బలంగా వ్యక్తపరచాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చీఫ్ పీటీ ఉషకు సూచించారు. వినేశ్ ఫొగాట్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.