కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో విధించిన లాక్ డౌన్లో కొన్ని నిబంధనలను ఎత్తివేస్తూ కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రయాణికుల చేరవేతలో అన్ని రకాల వాహనాలకు అనుమతి ఇవ్వడంతో పాటు సరుకుల రవాణాపై గతంలో ఉన్న నిబంధనలను తొలగించింది. అయితే వీటిని రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు తిరిగేందుకు ఇంతవరకు అవకాశం లేదు. దీనిని సైతం ఎత్తివేస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. అయితే వీటితో పాటు బస్సులు గతంలో మాదిరి రాత్రి వేళల్లో తమ సర్వీసులు కొనసాగించేలా అవకాశం కల్పించింది.
భారీ వాహనాలపై ఉన్న పరిమితులను కేంద్రం ఎత్తివేసింది. లాక్‌డౌన్ నిబంధనలతో పగటిపూటకే పరిమితమైన వాహనాలపై అంక్షలను సడలించింది. ఇకపై రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకూ వాహనాలు రోడ్డెక్కనున్నాయి. ఈమేరకు నిబంధనలను కేంద్రం శుక్రవారం సడలించింది. గూడ్స్, ట్రక్కులు, బస్సులు ప్రయాణించడానికి ఎలాంటి పరిమితులూ లేవని తేల్చి చెప్పింది. అయితే ప్రజల కదలికలపై మాత్రం నిషేధం యథాతథంగా కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. జన సమర్థ కార్యక్రమాల్లో పాల్గొనకుండా భౌతిక దూరం అమలయ్యేలా చూడాలని రాష్ట్రాల సూచించింది. కరోనా కట్టడిలో భాగంగానే నిబంధనలను అమలులోకి తేచ్చామని, సరుకుల రవాణాను అరికట్టడం ఎంతమాత్రమూ కాదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాలకూ స్పష్టం చేశారు. కేంద్రం తాజా సడలింపులతో కరోనా వైరస్ లాక్ డౌన్ నిబంధనలు చలావారకూ తొలగించినట్టైంది.