budget 2020 : కార్యాలయానికి చేరుకున్న నిర్మలా సీతారామన్

Update: 2020-02-01 03:54 GMT

 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను మరి కాసేపట్లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ రెండోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. మంత్రి నిర్మాలా సీతారామన్‌, ఆర్ధిక శాఖ మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌ శనివారం ఉదయం ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా అధికారులతో చర్చిస్తున్నారు. బడ్జెట్ పాఠం ఎలా చదవాలి అనే అంశంపై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా ఆమె ప్రసంగం పార్లమెంటులో ఉదయం 11 గంటలకు ప్రారంభమౌతుందని సమాచారం. ఈసారి బడ్జెట్‌పై ప్రజలతోపాటు కంపెనీలు కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నాయి. వేతన జీవులు, వ్యవసాయ రైతులు, మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్‌లో ఎలాంటి ప్రాధాన్యం లభిస్తుందో అని ఎదురుచూస్తున్నారు. దాదాపు సభ్యులు అందరూ ఇప్పటికే పార్లమెంటుకు చేరుకున్నారు. ఈ సమావేశాల్లో ఖచ్చితంగా పాల్గొనాల్సిందిగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎంపీలను ఆదేశించాయి. శుక్రవారం ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సర్వేను ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News