Delhi: తాజ్ మహల్ వద్ద అనుమానాస్పద డబ్బా కలకలం

Delhi: ప్రపంచ ప్రఖ్యాత కట్టడం 'తాజ్‌మహల్‌' వద్ద ఓ అనుమానాస్పద డబ్బా కలకలం రేపింది.

Update: 2021-04-03 05:45 GMT

Taj మహల్:(ఫైల్ ఇమేజ్)

Delhi: నిజమైన ప్రేమకు చిహ్నంగా, ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా, భారతదేశంలో టూరిస్టులను విపరీతంగా ఆకర్షించే పర్యాటక కేంద్రంగా ఆగ్రాలోని ప్రపంచ ప్రఖ్యాత కట్టడం 'తాజ్‌మహల్‌' వద్ద ఓ అనుమానాస్పద డబ్బా కలకలం రేపింది. పేలుడు పదార్థాలు ఉన్నాయనే అనుమానంతో భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు నిర్వహించారు. చివరకు అందులో ఆహార పదార్థాలు మాత్రమే ఉన్నాయని తెలుసుకొని అంతా ఊపిరిపీల్చుకున్నారు. తాజ్‌మహల్‌ సమీపంలోని పురాణీ మండీ ప్రాంతం షాజహాన్‌ గార్డెన్‌ వద్ద ఓ చిన్న క్యాన్‌కు తాళం వేసి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే తాజ్‌గంజ్‌ పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు బాంబ్‌ స్క్వాడ్‌కు తెలియజేశారు. ఈ సమయంలో ఆ మార్గం వైపు వెళ్లకుండా పోలీసులు వాహనాలను నిలిపివేశారు. బాంబు నిర్వీర్య దళం ప్రత్యేక కిట్‌ ధరించి అత్యంత జాగ్రత్తగా క్యాన్‌ తెరిచింది. అయితే అందులో పేలుడు పదార్థాలు లేవని, కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయని తేల్చింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకుని ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు.

Tags:    

Similar News