మహారాష్ట్రలో 'ఎన్‌ఆర్‌సి' ని అమలు చేయం: సీఎం ఉద్దవ్ థాకరే

మహారాష్ట్రలో నేషనల్ సివిల్ రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి) ను అమలు చేయబోమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే మరోసారి చెప్పారు.

Update: 2020-02-02 07:55 GMT

మహారాష్ట్రలో నేషనల్ సివిల్ రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి) ను అమలు చేయబోమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే మరోసారి చెప్పారు. శివసేన మౌత్ పీస్ సామ్నాలో ఇంటర్వ్యూలో శివసేన ఎంపి సంజయ్ రౌత్ ఠాక్రేను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్బంగా ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ.. 'పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పౌరసత్వాన్ని కొల్లగొట్టడం గురించి కాకుండా.. ఇవ్వడం గురించి ఉంటే బాగుంటుంది.. ఎన్‌ఆర్‌సి అమలు చేస్తే, హిందువులు, ముస్లింలు ఇద్దరికీ పౌరసత్వం నిరూపించడం కష్టం. అందుకే నేను దీనిని జరగనివ్వను.' అని పేర్కొన్నారు. అలాగే హిందుత్వ నినాదాన్ని లేవనెత్తారు. శివసేన తన హిందుత్వ భావజాలాన్ని విడిచిపెట్టలేదని, ఇతర మతాలతో ఎటువంటి ఒప్పందం లేదని ఉద్ధవ్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

కాగా అంతకుముందు లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు(caa)పై శివసేన మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. అయితే, పౌరసత్వ సవరణ బిల్లును లోన్ సభ లో ఆమోదించి రాజ్యసభకు పంపించినప్పుడు, ఓటింగ్ సమయంలో శివసేన సభ నుండి బయటకు వెళ్ళిపోయింది. దీని తరువాత, పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంటు ఉభయ సభల నుండి ఆమోదం పొందింది. అంతేకాదు రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారింది. పౌరసత్వ సవరణ చట్టం అధికారిక గెజిట్‌లో కూడా ప్రచురించబడింది.

అయితే ఎన్‌ఆర్‌సి ని అమలు చేయనున్న థాకరే.. కేరళ, పంజాబ్ తరహాలో సిఎఎకు వ్యతిరేకంగా రాష్ట్ర శాసనసభలో తీర్మానాన్ని తీసుకురావాలన్న డిమాండ్‌పై ముస్లిం పండితులు, మతాధికారుల ప్రతినిధి బృందానికి ఎటువంటి హామీ ఇవ్వకపోవడం గమనార్హం.

ఇదిలావుంటే మహారాష్ట్ర రాజకీయాల్లో 'హిందూ హృదయ సామ్రాట్' ఎవరు? ఈ ప్రశ్నపై, మహారాష్ట్ర నవనిర్మాన్ సేన (ఎంఎన్ఎస్) మరియు శివసేనలలో యుద్ధం ప్రారంభమైంది. ఎంఎన్ఎస్.. హిందూ మతం రాజకీయాలపై హక్కును గొప్ప శక్తితో అభివర్ణించింది. ఇంతలో, మహారాష్ట్రలోని థానేలో ఒక పోస్టర్ దర్శనమిచ్చింది. అందులో రాజ్ ఠాక్రేను ' హిందూ హృదయ సామ్రాట్ ' గా అభివర్ణించారు. దీంతో అక్కడ మరోసారి హిందుత్వ సెంటిమెంటు బలంగా రాజుకున్నట్టయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


Tags:    

Similar News