శ్రీనగర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదుల హతం.. ఒక సిఆర్పిఎఫ్ సిబ్బంది మృతి..

జమ్మూకాశ్మీర్ 'శ్రీనగర్' శివార్లలో బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు.

Update: 2020-02-05 09:42 GMT

జమ్మూకాశ్మీర్ 'శ్రీనగర్' శివార్లలో బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. దురదృష్టవశాత్తు ఈ ఘటనలో సిఆర్‌పిఎఫ్ సిబ్బంది ఒకరు మృతి చెందారు. మోటారు సైకిల్ మీద వచ్చిన ఉగ్రవాదులు సిఆర్పిఎఫ్ పెట్రోలింగ్ సిబ్బందిపై కాల్పులు జరిపి ఒక సిఆర్పిఎఫ్ వ్యక్తిని చంపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సిఆర్‌పిఎఫ్ సిబ్బంది ఇద్దరు ఉగ్రవాదులను వెంటాడి కాల్చి చంపి ప్రతీకారం తీర్చుకుంది. ఈ విషయాన్నీశ్రీనగర్ సర్కిల్ ఐజి సిఆర్పిఎఫ్ రవి దీప్ షాహి చెప్పారు. ఘటన అనంతరం సీనియర్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.. అంతేకాదు ఆ ప్రదేశంలో అదనపు బలాలు మోహరించారు. హతమైన ఉగ్రవాదుల గుర్తింపును నిర్ధారిస్తున్నామని సిఆర్‌పిఎఫ్ తెలిపింది.

ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని పేర్కొంది. కాగా గత వారం తరువాత ఇది రెండవ ఎన్‌కౌంటర్. జనవరి 31 న, జమ్మూ శివార్లలోని నాగోట్రాలో జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పాక్ ఉగ్రవాదులు మరణించారు, పోలీసు బృందం యాదృచ్చికంగా టోల్ పోస్ట్ సమీపంలో వాహనాన్ని తనిఖీ చేస్తుండగా ఉగ్రవాదులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో భద్రతా దళాలపై గ్రెనేడ్ విసిరి పారిపోయే ప్రయత్నం చేశారు.. దీంతో భద్రతా సిబ్బంది ఎన్కౌంటర్ చేసింది.అలాగే శ్రీనగర్ కు చెందిన ఐదుగురు జైషే మొహమ్మద్ కార్యకర్తలను గత నెలలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News