Twitter: మళ్లీ చెలరేగిన ట్విటర్.. కశ్మీర్ ను..

Twitter: కేంద్రం, ట్విట్టర్‌ మధ్య వివాదం మరింత ముదురుతోంది.

Update: 2021-06-28 13:51 GMT

Twitter: మళ్లీ చెలరేగిన ట్విటర్.. కశ్మీర్ ను..

Twitter: కేంద్రం, ట్విట్టర్‌ మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే కొత్త ఐటీ నిబంధనల విషయంలో భారత ప్రభుత్వం, ట్విట్టర్‌ మధ్య వార్‌ నడుస్తోంది. నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అకౌంట్‌ను నిలిపివేసింది. అంతకుముందు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్‌ అకౌంట్‌కు బ్లూ టిక్‌ మార్క్‌ను తొలగించి వివాదాన్ని కొనితెచ్చుకుంది ట్విట్టర్‌.

ఇప్పుడు మరోసారి ధిక్కార చర్యకు దిగింది ట్విట్టర్‌. భారత చిత్రపటాన్ని తప్పుగా చూపించింది. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌ను వేరే దేశంగా చూపుతూ ఇండియా మ్యాప్‌ను వక్రీకరించింది. జమ్మూకశ్మీర్‌ను ప్రత్యేక దేశంగానూ, లద్దాఖ్‌ను చైనాలో అంతర్భాగంగానూ పేర్కొంది. దీంతో నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది ట్విట్టర్‌.

గతంలోనూ ట్విట్టర్‌ ఇలాంటి తప్పులే చేసింది. గత ఏడాది లద్దాఖ్‌ను చైనాలో అంతర్భాగమని చూపించింది. దీనిపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తగా క్షమాపణలు చెప్పింది. ఇప్పుడు మరోసారి అలాంటి తప్పే చేసింది. ఈ సారి ఏకంగా లద్దాఖ్‌ను వేరే దేశంగా చూపించింది. ప్రతిసారీ ఏదొక వివాదం తీసుకొస్తుండడంతో పరిస్థితులు భారత ప్రభుత్వం వర్సెస్‌ ట్విట్టర్‌గా మారిపోయాయి. మరోవైపు నూతన ఐటీ నిబంధనలు పాటించనందుకు ట్విట్టర్‌ చర్యలపై సీరియస్‌గా ఉంది భారత ప్రభుత్వం.

Tags:    

Similar News