Bihar Gun Fire: గత కొన్ని రోజులుగా బిహార్‌లో ఎక్కడో ఒక చోట కాల్పులు
Bihar Gun Fire: భోజ్‌పూర్ ఆస్పత్రిలో దుండగుల కాల్పులు పేషెంట్‌కు తీవ్ర గాయాలు
Bihar Gun Fire: గత కొన్ని రోజులుగా బిహార్‌లో ఎక్కడో ఒక చోట కాల్పులు
Bihar Gun Fire: వరుస తుపాకీ మోతలతో బిహార్ వణికి పోతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఏదో ఒక చోట నాటు తుపాకులు గర్జిస్తునే ఉన్నాయి. రాజకీయ కక్షలు, ఆర్థిక లావాదేవీలు.. ఇతరత్రా కారణాలతో ప్రత్యర్థులు కాపుకాసి కాల్పులు జరుపుతున్నారు. అయితే ప్రస్తుతం ఏకంగా ఆస్పత్రిలోనే కాల్పులకు తెగబండ్డారు దుండగులు. తాజాగా బిహార్‌లోని బోజ్‌పూర్ ఆస్పత్రిలో సాయుధులైన దుండగులు పేషెంట్‌పై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ పేషెంట్ పరిస్తితి విషమంగా మారింది. కాల్పులకు తెగబడ్డ వ్యక్తలు తుపాకులతో పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు మొదలు పెట్టారు. ఆస్పత్రిలో కాల్పులతో మిగతా పేషెంట్లు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గోడల్లోకి దూసుకెళ్లిన బుల్లెట్లు,, బుల్లెట్ షెల్స్‌తో ఆస్పత్రిలో భయంకరమైన వాతావరణం నెలకొన్నది.