Uttar Pradesh: ఝాన్సీ రైల్వేస్టేషన్ దగ్గర పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
* రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ పునరుద్ధరణ పనులు చేపట్టింది
ఝాన్సీ రైల్వేస్టేషన్ దగ్గర పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఆయిల్ ట్యాంకర్లతో వెళుతున్న గూడ్స్ ఝాన్సీ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. కొద్ది దూరం వరకు గూడ్స్ రైలు ఈడ్చుకు వెళ్లడంతో ట్రాక్ ధ్వంసం అయ్యింది దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ పునరుద్ధరణ పనులు చేపట్టింది. కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు.