Devendra Fadnavis: నక్సల్ ఫ్రీ భారత్ నిర్మిస్తాం
Devendra Fadnavis: మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు.
Devendra Fadnavis: మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. మహారాష్ట్ర పోలీసుల ఎదుట మల్లోజుల లొంగిపోయారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో మల్లోజుల సహా మావోయిస్టులు తమ ఆయుధాలు సరెండర్ చేశారు. మల్లోజులతో పాటు మరో 61 మంది మావోయిస్టులు ఆయుధాలను విడిచిపెట్టారు. ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో తమ ఆయుధాలను పోలీసులకు అందించారు.
మల్లోజులపై దాదాపు ఆరు కోట్ల రివార్డు ఉండటంతో సీఎం ఫడ్నవీస్.. రివార్డును ఆయనకు అప్పగించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో మోస్ట్‌వాంటెడ్‌గా మల్లోజుల ఉన్నారు. ఈ సందర్భంగా మల్లోజులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. మల్లోజుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. దేశంలో మావోయిజానికి చోటులేదన్నారు మహరాష్ట్ర సీఎం ఫడ్నవీస్. నక్సల్ ఫ్రీ భారత్ నిర్మిస్తాం అని ఆయన చెప్పుకొచ్చారు.