Maoist Encounter: చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులకు చావు దెబ్బ..మావోయిస్టు అగ్రనేత దామోదర్ మృతి

Update: 2025-01-19 00:22 GMT

Maoist Encounter: మావోయిస్టులకు భారీ షాక్ తగిలింది. రెండు రోజుల క్రితం జనవరి 16వ తేదీ తెలంగాణ -ఛత్తీస్ గఢ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత దామోదర్ మరణించినట్లు లేఖ విడుదల చేశారు. ఈ విషయాన్ని మావోయిస్టులే వెల్లడించారు. దక్షిణ బస్తర్ కార్యదర్శి గంగా పేరుతో బహిరంగా లేఖను కూడా విడుదల చేశారు. రెండు రోజు ల క్రితం మరణించింది 12 సభ్యులుకాదని 18 మంది మరణించినట్లు లేఖ ద్వారా తెలియజేశారు. చనిపోయిన మావోయిస్టు దామోదర్ అలియాస్ చొక్కారావు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. అతనిపై రూ. 50లక్షల వరకు రివార్డు కూడా ఉంది.

ఛత్తీస్ గఢ్ కు కేంద్రంగా మార్చుకున్న మావోయిస్టులపై భద్రతా బలగాలు మెరుపు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జనవరి 16వ తేదీన ఛత్తీస్ ఘడ్ తెలంగాణ బోర్డర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోల సంఖ్య 12 కాదని 18 అంటూ దక్షిణ బస్తర్ కార్యదర్శి గంగా పేరుతో బహిరంగ లేఖను విడుదల చేశారు. అంతేకాదు మరణించినవాళ్లలో రాష్ట్ర మావోయిస్టు కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ప్రాణాలు కోల్పోయినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.

కాగా ఎన్ కౌంటర్ లో మరణించిన దామోదార్ గత 30ఏండ్లుగా మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన స్వస్థలం తెలంగాణలోని ములుగు జిల్లా కాల్వపల్లి. ఆయన మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. దామోదర్ ను పట్టిస్తే రూ. 50లక్షల రివార్డు ఉంది. 




 


Tags:    

Similar News