అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్జేడీకి భారీ షాక్‌.. నితీష్ పార్టీలోకి సీనియర్ నేత!

బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీకి భారీ షాక్ తగిలింది. లాలూ ప్రసాద్ యాదవ్ సన్నిహితుడు, పార్టీ సీనియర్ నేత..

Update: 2020-09-10 09:47 GMT

బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీకి భారీ షాక్ తగిలింది. లాలూ ప్రసాద్ యాదవ్ సన్నిహితుడు, పార్టీ సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ రాజీనామా చేశారు. గురువారం తన రాజీనామా లేఖను పార్టీ చీఫ్‌ లాలూప్రసాద్‌ యాదవ్‌కు మెయిల్ లో పంపారు. అయితే రాజీనామాకు సరైన కారణాలు ఆయన లేఖలో వెల్లడించలేదు. ఆయన నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్‌లో చేరవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. రఘువంశ్ ప్రసాద్ సింగ్ 1997 లో ప్రారంభమైనప్పటి నుండి ఆర్జేడీ , రాష్ట్ర జనతాదళ్తో లాలూ యాదవ్ తో కలిసి ఉన్నారు. అవినీతి ఆరోపణలపై తన తండ్రి జైలుకు వెళ్ళినప్పటి నుండి లాలూ యాదవ్ కుమారుడు తేజశ్వి యాదవ్ నడుపుతున్న ఆర్జెడీకి సింగ్ వెన్నుదన్నుగా ఉన్నారు. అయితే ఆయన కొంతకాలంగా తేజశ్వి యాదవ్ వ్యవహారశైలిపట్ల అసంతృప్తితో ఉన్నారు. అందులో భాగంగానే పార్టీకి రాజీనామా చేసి ఉంటారనే వార్తలు వస్తున్నాయి.

జూన్ లో పార్టీకి రాసిన లేఖలో, సింగ్ ఇటీవలి నెలల్లో ఆర్జెడిని ప్రజలలోకి తీసుకెళ్లడం పట్ల తాను సంతోషంగా లేనని పేర్కొన్నారు. ఇక ఆయన ప్రస్తుతం ఢిల్లీ లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఐసియులో ఉన్నారు, కరోనావైరస్ సంక్రమణ తరువాత సాధారణ ఆరోగ్య సమస్యలకు చికిత్స తీసుకుంటున్నారు. కాగా రఘువంశ్‌ ప్రసాద్‌ గతంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్జేడీలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తరువాత అత్యంత సీనియర్‌ నేతగా, పార్టీ ఉపాధ్యక్షుడిగా గుర్తింపుపొందారు. ఇదిలావుంటే బీహార్ ఎగువ సభలోని ఎనిమిది మంది ఆర్జేడీ సభ్యులలో ఐదుగురు ఆ పార్టీని విడిచిపెట్టి, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీలో చేరారు. శాసనమండలి (ఎంఎల్‌సి) లో మిగిలిన ముగ్గురు సభ్యులలో లాలూ యాదవ్ భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి సహా మరో ఇద్దరు సభ్యులు ఉన్నారు.   

Tags:    

Similar News