Top 6 News @ 6 PM: రంగన్న డెడ్ బాడీకి రీ పోస్టుమార్టం ఎందుకు?... మరో 5 ముఖ్యాంశాలు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షి రంగన్న మృతదేహానికి శనివారం రీ పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.
1. ట్యాక్స్ తగ్గించేందుకు భారత్ గ్రీన్ సిగ్నల్: ట్రంప్
ట్యాక్స్ తగ్గించేందుకు భారత్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు. తమ దేశంలో తయారైన వస్తువులపై భారత్ ఎక్కువ ట్యాక్స్ వసూలు చేస్తోందని ట్రంప్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. భారత్ వస్తువులపై తాము కూడా అంతే స్థాయిలో ట్యాక్స్ వసూలు చేస్తామని ఆయన ప్రకటించారు. భారత్, చైనా సహా పలు దేశాలపై భారీ ట్యాక్స్ విధిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
2. గుజరాత్‌లో కొత్త ప్రభుత్వం కోసం ప్రజల ఎదురుచూపు: రాహుల్ గాంధీ
కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను, నాయకులను గుర్తించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చెప్పారు. శనివారం గుజరాత్ లో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం ఎవరు పనిచేస్తున్నారో గుర్తించాలన్నారు. గుజరాత్ లో ప్రజలు కొత్త ప్రభుత్వ పాలన కోసం చూస్తున్నారని ఆయన అన్నారు.
3. ఎస్ఆర్ఎస్‌సీపీ కాల్వలో దూసుకెళ్లిన కారు
వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద ఎస్ఆర్‌ఎస్‌పీ కాల్వలో కారు దూసుకెళ్లింది. శనివారం మధ్య ఈ ఘటన జరిగింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మేచరాజుపల్లికి చెందిన సోమారపు ప్రవీణ్ తన భార్య కృష్ణవేణి కుమార్తె చైత్రసాి, కొడుకు ఆర్యవర్ధన్ సాయితో కలిసి కారులో వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఎస్ఆర్‌ఎస్‌పీ కాలువలో పడింది. కారు డ్రైవ్ చేస్తున్న ప్రవీణ్ కు గుండె నొప్పి వచ్చింది. దీంతో కారు అదుపు తప్పింది. కృష్ణవేణి కొడుకు మరణించారు. కారుతో సహా ప్రవీణ్, చైత్రసాయి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. కృష్ణవేణి ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు.
4. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షి రంగన్న మృతదేహానికి శనివారం రీ పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం రంగన్న మరణించారు. రంగన్న మరణంపై అనుమానాలున్నాయని ఆయన భార్య, కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులు వరుసగా మరణిస్తున్నారు. రంగన్న మరణంపై మార్చి 7న జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించారు. రంగన్న కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే రంగన్న డెడ్ బాడీకి రీపోస్టుమార్టం నిర్వహించారు.
5. రన్యారావు శరీరంపై గాయాలు:డీఆర్ఐ
బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన సినీ నటి రన్యారావు శరీరంపై పలు చోట్ల గాయాలున్నాయని డైరేక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్ తెలిపింది. సిండికేట్ ముఠా బంగారం అక్రమ రవాణాలో రన్యారావు భాగమయ్యారని డీఆర్ఐ తెలిపింది. వీఐపీ ప్రోటోకాల్స్ ను దుర్వినియోగం చేస్తూ బంగారం అక్రమంగా రవాణా చేస్తూ ఆమె పట్టుబడ్డారు. ఆమె నుంచి రూ. 2.06 కోట్ల విలువైన ఆభరణాలు, రూ. 2.67 కోట్ల నగదు జప్తు చేశారు 14.2కిలోల బంగారు బిస్కట్లు కూడా సీజ్ చేశారు. ఆరు నెలల్లో ఆమె 27 సార్లు దుబాయ్ కు వెళ్లి వచ్చింది.
6. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏకం కావాలి: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి
కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం అంతా ఏకం కావాలని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఎంపీలతో శనివారం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంట్ లో ఏయే అంశాలు లేవనెత్తడాలనే విషయాలపై చర్చించారు. దీనికి సంబంధించి బుక్ లెట్ కూడా అందించారు.