Top 6 News @ 6 PM: కృష్ణా జలాల్లో అన్యాయంపై కేంద్రానికి తెలంగాణ ఫిర్యాదు: మరో 5 ముఖ్యాంశాలు

కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు..కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా, ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన కేంద్ర మంత్రి పాటిల్ తో చర్చించారు.

Update: 2025-03-03 12:26 GMT

1. రాజధానిపై మా నిర్ణయం ఏమిటో చెబుతాం: బొత్ప సత్యనారాయణ

రాజధానిపై తమ పార్టీ విధానం ఏమిటనేది చర్చించి చెబుతామని మాజీ మంత్రి, వైఎస్ఆర్‌సీపీ నాయకులు బొత్స సత్యనారాయణ చెప్పారు. అప్పట్లో ఉన్న పరిస్థితుల ఆధారంగా మూడు రాజధానులు అనేది అప్పట్లో తమ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. అమరావతి స్మశానంలో మారిందని గతంలో తాను చేసిన వ్యాఖ్యలు నిజమేనని ఆయన అంగీకరించారు. అప్పట్లో ఉన్న సందర్బం మేరకు అలా మాట్లాడినట్టు ఆయన చెప్పారు.

2. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం: రేవంత్ రెడ్డి

కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు..కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా, ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన కేంద్ర మంత్రి పాటిల్ తో చర్చించారు. ఈ భేటీ ముగిసిన తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై చర్చించారు. . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పర్యావరణ అనుమతుల విషయమై కూడా సీఎం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించారు. కృష్ణా బేసిన్ నుంచి ఏపీ ఎక్కువ నీటిని తీసుకుంటుందని మంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు.

3. గల్వాన్ కమాండ‌ర్ ను సన్మానించిన చైనా

గల్వాన్ లోయలో భారత్ సైనికులతో ఘర్షణలో పాల్గొన్న పీఏఎల్ కమాండర్ క్విఫాబావోను చైనా సన్మానించింది. 2020 జూన్ 15న గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో క్విఫాబావో పాల్గొన్నారు. గతంలో అతడికి సెంట్రల్ మిలటరీ కమిషన్ నుంచి పతకం దక్కింది. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మరణించారు. చైనా వైపు నుంచి 38 మంది పాల్గొన్నారు.

4. ఏపీలో 16,347 టీచర్ పోస్టుల భర్తీ: లోకేశ్

మెగా డీఎస్పీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. సోమవారం ఏపీ అసెంబ్లీలో ఆయన పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. పేరేంట టీచర్ మీటింగ్ లో ఇచ్చిన స్టార్ రేటింగ్ ఆధారంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. జగన్ ప్రభుత్వం 117 జీవో జారీ చేయడంతో విద్యకు నిరుపేద విద్యార్థులు దూరమయ్యారన్నారు.

5. అర్జంట్ గా పిల్లల్ని కనండి: తమిళనాడు సీఎం స్టాలిన్

కొత్తగా పెళ్లైన జంటలు వెంటనే పిల్లల్ని కనాలని తమిళనాడు సీఎం స్టాలిన్ కోరారు. సోమవారం నాగపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జనాభా ప్రాతిపదికన లోక్ సభ నియోజకవర్గాలు నిర్ణయిస్తే తమిళనాడు అన్యాయం జరుగుతోందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనలో నష్టం జరగకుండా ఉండాలంటే కొత్తగా పెళ్లైన జంటలు అత్యవసరంగా పిల్లల్ని కనాలని ఆయన కోరారు.

నియోజకవర్గాల పునర్విభజనపై మార్చి 5న స్టాలిన్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 40 గుర్తింపు పొందిన రాజీయ పార్టీల ప్రతినిధులకు ఆహ్వానం పంపారు.

6. ఆకాశ్ ఆనంద్ పై బహిష్కరణ వేటేసిన మాయావతి

ఆకాశ్ ఆనంద్ ను పార్టీ నుంచి బహిష్కరించారు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి. ఈ మేరకు ఆ పార్టీ సోమవారం ప్రకటించింది. మార్చి 2న ఆకాశ్ ఆనంద్ ను పార్టీ పదవుల నుంచి తప్పించారు. పార్టీ కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. సోషల్ మీడియాలో ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు.

Tags:    

Similar News