Tokyo Paralympics: టోక్యో ఒలింపిక్స్ లో మరో స్వర్ణం సాధించిన భారత్
* టోక్యో ఒలింపిక్స్ లో మరో స్వర్ణం సాధించిన భారత్ * జావెలిన్ త్రోలో సుమిత్ ఆంటిల్ కు స్వర్ణం
Tokyo Paralympics: టోక్యో ఒలింపిక్స్ లో మరో స్వర్ణం సాధించిన భారత్
Tokyo Paralympics: టోక్యో పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. పారాలింపిక్స్ లో భారత్ రెండో గోల్డ్ సాధించింది. ఉదయం అవని లెఖారా రైఫిల్ షూటింగ్ లో స్వర్ణ పతకం సాధించగా ఇప్పుడు సుమీత్ ఆంటిల్ జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించాడు. సుమీత్ సాధించిన ఈ రికార్డు ప్రపంచ రికార్డుగా నమోదైంది. మూడు నిమిషాల వ్యవధిలోనే తన రికార్డును తానే తిరగ రాశాడు సుమీత్.
ఇప్పటికే టేబుల్ టెన్నిస్ లో భవీనా పటేల్ రజతం సాధించగా, హైజంప్ లో నిషాద్ కుమార్ రజత పతకం గెలిచాడు. ఇక అవనీ లెఖారా రైఫిల్ షూటింగ్ లో స్వర్ణం గెలిస్తే జావెలిన్ త్రోలో సుమీత్ ఆంటిల్ మరో గోల్డ్ కొట్టి భారత్ కీర్తి పతకాన్ని ఎగుర వేశాడు.