Petrol Diesel Price Today: స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol Diesel Price Today: తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి.
Petrol Diesel Price Today:(File Image)
Petrol Diesel Price Today: గత కొన్ని రోజుల క్రితం జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదలకు బ్రేక్ పడింది. అంతకు ముందు ప్‌పతి రోజూ పెరుగుతూ వచ్చిన ఇంధన ధరల పెంపు కొన్ని రోజులు ఆగిపోయింది. అయితే తాజాగా మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరకు రెక్కలొచ్చాయి. ఈ క్రమంలోనే మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. అయితే గురువారం కొంతమేర ఇంధన ధరలకు బ్రేక్ పడినట్లు బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది.
దేశంలోని వివిధ నగరాల్లో...
దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.85 గా ఉండగా.. డీజిల్ రూ. 83.51 వద్ద కొనసాగుతోంది. ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.14 గా ఉండగా… డీజిల్ రూ. 90.71 గా నమోదైంది. చెన్నైలో గురువారం లీటర్ పెట్రోల్ ధర రూ. 94.54 గాఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే బుధవారంతో పోలిస్తే స్వల్పంగా తగ్గి రూ. 88.34 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.94 ఉండగా.. డీజిల్ రూ. 88.53 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో …
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 96.50 ఉండగా.. డీజిల్ రూ. 91.04 వద్ద ఉంది. కరీంనగర్‌లో ధరల్లో కాస్త తగ్గుదల కనిపించింది ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 96.37 గా ఉండగా.. డీజిల్ ధర రూ. 90.91 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలోనూ ధరలు తగ్గాయి ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ. 98.97 వద్ద కొనసాగుతుండగా.. డీజిల్ ధర రూ. 92.95 గా ఉంది. విశాఖలో పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 98.07 గా ఉండగా.. డీజిల్ ధర రూ. 92.06 గా ఉంది.