నేడు మహాత్మాగాంధీ 73వ వర్ధంతి
* ఢిల్లీ రాజ్‌ఘాట్‌లో శ్రద్ధాంజలి ఘటించిన ప్రముఖులు * నివాళులర్పించిన కోవింద్, వెంకయ్య, మోడీ, రాజ్‌నాథ్ * దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ..
Tribute to Mahatma Gandhi
గాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీ రాజ్‌ఘాట్‌లో మహాత్ముడికి పలువురు ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ గాంధీకి నివాళులర్పించారు.
అనంతరం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల సేవలను గుర్తు చేసుకుంటూ రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు కోవింద్, వెంకయ్య, మోడీ, రాజ్‌నాథ్.